Saudi Arabia : వీసా నిబంధనల్లో మార్పులు చేస్తూ, సౌదీ అరేబియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం తమ దేశానికి వచ్చే వలస కార్మికులను నియంత్రించడానికి ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశం నుంచి అధిక సంఖ్యలో సౌదీకి వెళ్తున్న కార్మికులకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారనుంది.
భారతీయుల ఉపాధి ప్రవాహం
భారతదేశం నుంచి స్కిల్డ్ ఉద్యోగులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే అన్ స్కిల్డ్ కార్మికులు గల్ఫ్ దేశాలను ఉపాధి కోసం ఆశ్రయిస్తుంటారు. ఇళ్ల పనులు, భవన నిర్మాణం, ఒంటెల సంరక్షణ వంటి వివిధ శారీరక కృషి అవసరమైన రంగాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో కూడా భారతీయ కార్మికులు భారీ స్థాయిలో ఉపాధి పొందుతున్నారు. వీరు సౌదీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Virat Kohli- Rishabh Pant: ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడనున్న విరాట్, పంత్, హర్షిత్ రాణా!
కొత్త నిబంధనలు
ఇప్పటి నుంచి సౌదీ అరేబియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ తమ విద్యా మరియు వృత్తి అర్హతలను నిర్ధారించడానికి ముందుగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. గతంలో ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉపాధి పొందడాన్ని అరికట్టడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. వీటిని అమలుచేయడం ద్వారా ఫ్రాడ్ కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు.
సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ప్రకారం, ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. వీసా ప్రాసెసింగ్ సమయంలో ప్రొఫెషనల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు ఆరునెలలుగా దీనిపై సౌదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
భారతీయులపై ప్రభావం
సౌదీ అరేబియాలో ప్రస్తుతం 24 లక్షల మందికిపైగా భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 8 లక్షల మంది ఇళ్లలో పనులు చేస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ వాసులు 27 లక్షల మందికి పైగా సౌదీ అరేబియాలో ఉంటూ ఈ సంఖ్యలో ముందున్నారు.
ఈ నిబంధనలు భారతీయుల ఉపాధిని నియంత్రించడానికే తెచ్చాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసా దరఖాస్తుల సమయంలో సంబంధిత సంస్థల నుంచి సర్టిఫికెట్ ధృవీకరణ అవసరంగా మారింది. దీనివల్ల భారతీయ కార్మికులకు సౌదీ చేరడం మరింత క్లిష్టమవుతుందని భావిస్తున్నారు. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ కార్మికులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందనే విశ్లేషణ ఉంది. కొత్త మార్గదర్శకాలు భారతీయ కార్మికులకు మరింత సవాళ్లు సృష్టిస్తాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.
England Cricketer: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. ఇంగ్లండ్ ప్లేయర్‌కు వీసా కష్టాలు!