Sanjoy Roy : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గత రెండు నెలలుగా విచారిస్తోంది. ఈ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. సీబీఐ రెడీ చేసిన ఛార్జిషీట్‌ను ఇవాళ సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించారు.
Also Read :Kamala Harris : ఖాళీ పేజీలతో కమలా హ్యారిస్‌పై పుస్తకం.. అమెజాన్‌లో అదిరిపోయే స్పందన
సీబీఐ ఛార్జిషీట్ ప్రకారం.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదు. ఆమెపై కాలేజీ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ రాయ్ (Sanjoy Roy) అత్యాచారం చేసి, మర్డర్ చేశాడు. సంజయ్ రాయ్ కాంట్రాక్టు ప్రాతిపదికన బెంగాల్ పోలీసు శాఖలో సివిక్ వాలంటరీ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. ఆగస్టు 9న తెల్లవారుజామున మద్యం మత్తులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోకి వచ్చిన సంజయ్ రాయ్.. సెమినార్ హాలులో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తొలుత అతడినే పోలీసులు అరెస్టు చేశారు. హత్యాచారం జరిగిన వెంటనే సెమినార్ హాలు నుంచి సంజయ్ రాయ్ బయటికి వస్తుండటం అక్కడున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
Also Read :Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
వాస్తవానికి సంజయ్ రాయ్ ఆగస్టు 9న నైట్ డ్యూటీ కోసం ఆ రోజు సాయంత్రమే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి వచ్చాడు. అయితే స్నేహితుడు ఒకరు ఆస్పత్రికి రాగా, అతడితో కలిసి కోల్‌కతా సిటీలో వ్యభిచార నివాసాలు ఉండే ఏరియాకు వెళ్లారు. అక్కడ ఓ వ్యభిచార నివాసంలోకి సంజయ్ రాయ్ స్నేహితుడు వెళ్లి వచ్చాడు. కానీ సంజయ్ రాయ్ బయటే ఉండిపోయాడు. ఈక్రమంలో ఆ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను అతడు లైంగికంగా వేధించాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఒకరికి సంజయ్ కాల్ చేసి.. అసభ్యంగా మాట్లాడాడు. అనంతరం సంజయ్ రాయ్, అతడి స్నేహితుడు కలిసి బార్‌కు వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత డ్యూటీ చేసేందుకు.. నేరుగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంజయ్ వచ్చేశాడు. కాలేజీలోని సెమినార్ హాలులోకి అతడు వెళ్లగా.. అక్కడ జూనియర్ వైద్యురాలు నిద్రిస్తోంది. మద్యం మత్తులో ఆమెపై హత్యాచారానికి తెగబడ్డాడు.