Site icon HashtagU Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యం నశిస్తుందని ఆందోళన చెందారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేత ఒకరు కేజ్రీవాల్ అరెస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన జీవితంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మనిషిగా ఆయన పట్ల నాకు సానుభూతి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు బహిరంగంగా మద్దతిచ్చిందని గుర్తు చేశాడు. హవాలా వ్యాపారి జైన్‌ డైరీలో అద్వానీ జీ, మాధవరావు సింధియా, కమల్‌నాథ్‌ వంటి నేతల పేర్లు రావడంతో పాటు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక కారణాలతో వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. రైలు ప్రమాదంపై లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కొన్ని నెలల క్రితం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు ముందు పదవిని విడిచిపెట్టి నైతిక బాధ్యత వహించినట్లు ఆయన చెప్పారు.

భారతదేశానికి ఇంత గొప్ప సంప్రదాయం ఉంది..వేల సంవత్సరాల క్రితం రాముడు తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. సింహాసనాన్ని లాక్కున్న వ్యక్తి ఎప్పుడూ రామచంద్ర రాజు సింహాసనంపై కూర్చోలేదు, కానీ అతని అన్నయ్య రాముడు తిరిగి వచ్చే వరకు అతని సింహాసనం నుండి పాలించాడని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిజం ఏమిటో కోర్టు తేల్చాల్సి ఉందన్నారు. అయితే ఈ స్కాంలో ఓ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అతడిని అరెస్టు చేశారు. కస్టడీలో ఉండి ఇంకా ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకుని ఉన్నారా? ఇది ఎలాంటి నైతికత? వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

Also Read: Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి