Sam Pitrodas Phone Hacked : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా కీలక విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని వారాలుగా తన ఫోన్, ల్యాప్‌టాప్ పదేపదే హ్యాక్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. తన సర్వర్ కూడా హ్యాకింగ్ బారిన పడుతోందన్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో వేలాది డాలర్లను చెల్లించాలని హ్యాకర్లు తనను డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ముడుపులు ఇవ్వకుంటే.. తన ప్రతిష్ఠను దెబ్బతీస్తామని సైబర్ కేటుగాళ్లు వార్నింగ్స్ ఇస్తున్నారని శామ్ పిట్రోడా పేర్కొన్నారు.
Also Read :World Meditation Day : ఏటా డిసెంబరు 21న ‘వరల్డ్ మెడిటేషన్ డే’.. ఐరాస ఆమోదం
‘‘నా పేరుతో హ్యాకర్లు అభ్యంతరకరమైన మెసేజ్‌లు, మెయిల్స్‌ను(Sam Pitrodas Phone Hacked) పంపే అవకాశం ఉంది. వాటిని ఎవరూ నమ్మొద్దు, స్పందించొద్దు. నా మెసేజ్‌లలోని లింక్‌లను క్లిక్ చేయొద్దు’’ అని శామ్ పిట్రోడా కోరారు. ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నందున వాటిని వెంటనే బ్లాక్ చేయలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. అమెరికాలోని చికాగోకు తిరిగొచ్చాక దీనిపై తగిన చర్యలు తీసుకుంటానన్నారు. దీనివల్ల తన స్నేహితులు, తోటి నెటిజన్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈమేరకు శామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.