Train Accident : గూడ్స్​ రైలును ఢీకొన్న ఎక్స్​ప్రెస్.. పట్టాలు తప్పిన 4 బోగీలు

Train Accident : రాజస్థాన్​‌లోని అజ్మీర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

  • Written By:
  • Updated On - March 18, 2024 / 10:41 AM IST

Train Accident : రాజస్థాన్​‌లోని అజ్మీర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్​ స్టేషన్​ సమీపంలో ఉన్న గూడ్స్​ రైలును.. వెనుక నుంచి వచ్చిన సబర్మతీ ఎక్స్​ప్రెస్​ ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతీ ఎక్స్​ప్రెస్​ ఇంజిన్​ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించామని నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ వెల్లడించారు.  అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో​ హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వారి బంధువులు సమాచారం కోసం 0145-2429642 హెల్ప్​లైన్ నంబర్(Train Accident)​కు కాల్ చేయాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join

సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారిని వెంటనే అజ్మీర్ రైల్వే స్టేషన్​కు తరలించారు. వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదం నేపథ్యంలో  ఈ రూట్‌లో ఆరు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను వేరే మార్గాల మీదుగా మళ్లించారు. 12065 అజ్​మేర్​- దిల్లీ-సరాయ్ రోహిల్లా, 22987 అజ్​మేర్​- ఆగ్రా ఫోర్ట్, 09605 అజ్​మేర్​-గంగాపూర్ సిటీ, 09639 అజ్​మేర్-రేవాడ్, 19735 జైపుర్ – మార్వార్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 12915 సబర్మతి – దిల్లీ రైలు, 17020 హైదరాబాద్-హిసార్ రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించింది.

Also Read : Elections 2024 : గాలి మోటార్లకు డిమాండ్.. ఎన్నికల ఎఫెక్టు.. రేట్లు ఇవీ