Caste Census : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక ప్రకటన చేసింది. దేశంలోని కులగణనకు మద్దతు తెలుపుతామని ఆర్ఎస్ఎస్ (ఆర్గనైజేషన్) జాతీయ స్థాయి ప్రతినిధి సునీల్ అంబేకర్ వెల్లడించారు. దీన్ని సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వాడుకోవచ్చు కానీ.. ఎన్నికల అంశంగా మార్చొద్దని ఆయన కోరారు. కేరళలోని పాలక్కడ్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ మూడు రోజుల జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సునీల్ అంబేకర్ ప్రసంగించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ప్రభుత్వాలు గణాంకపరమైన అవసరాలను తీర్చుకునేందుకు కులగణనను నిర్వహించొచ్చు. మన సమాజంలో కులాలతో ముడిపడిన అంశాలు చాలా సున్నితమైనవి. జాతీయ సమగ్రత కోసం అందరూ కట్టుబడి ఉండాలి. కుల గణనను ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలనే ఆలోచన సరికాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.‘‘కులగణన(Caste Census) ద్వారా వచ్చే సమాచారాన్ని సమాజహితం కోసమేు వాడుతారని మేం భావిస్తున్నాం. కులగణన నిర్వహించేటప్పుడు అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూడాలి’’ అని సునీల్ అంబేకర్ కోరారు.అయితే ఇటీవలే మరో ఆర్ఎస్ఎస్ నేత శ్రీధర్ గడ్గ్ కులగణనను వ్యతిరేకించారు. అది పనికిరాని కసరత్తు అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ (ఆర్గనైజేషన్) జాతీయ స్థాయి ప్రతినిధి సునీల్ అంబేకర్ నుంచి ఈవిధమైన వివరణ వెలువడటం గమనార్హం.
Also Read :SEBI Chief : సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపైనా ఆర్ఎస్ఎస్ స్పందించింది. దాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొంది. చట్టాలను పునః సమీక్షించి వాటిల్లో మార్పులు చేసి.. దర్యాప్తు, విచారణ వేగవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. అప్పుడే బాధితురాలికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా, కులగణనకు అనుకూలంగా ఆర్ఎస్ఎస్ ప్రకటన చేయడం అనేది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. మరి బీజేపీ దీనితో ఏకీభవిస్తుందా ? లేదా ? అనేది వేచిచూడాలి.