Rs 50 Lakh Contract : నన్ను చంపేందుకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు.. మంత్రి సంచలన వ్యాఖ్య

Rs 50 Lakh Contract :  ‘‘నన్ను చంపేందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు’’ అని మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌గల్ సంచలన ఆరోపణ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Rs 50 Lakh Contract

Rs 50 Lakh Contract

Rs 50 Lakh Contract :  ‘‘నన్ను చంపేందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు’’ అని మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌గల్ సంచలన ఆరోపణ చేశారు. ఈమేరకు తన ఆఫీసుకు ఒక బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఆ లేఖలో కొన్ని కార్ల నంబర్ ప్లేట్ల వివరాలు, కొన్ని ఫోన్ నంబర్లు, ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయనే సమాచారం ఉందన్నారు. వార్నింగ్ లెటర్‌ను(Rs 50 Lakh Contract) పోలీసులకు అందించినట్లు ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ సైతం వస్తున్నట్టు ఛగన్ భుజ్‌గల్ చెప్పారు. తాను పాలిటిక్స్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నో బెదిరింపులను చూశానన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఛగన్‌కు అదనపు భద్రత కేటాయించే విషయంపై డిస్కస్ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join

  • మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించగా..ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భుజ్ గల్ వ్యాఖ్యలు చేశారు.  ఆ వెంటనే ఆయనకు వార్నింగ్ లెటర్ రావడం గమనార్హం.
  • ఛగన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గంలో చేరి ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం మంగళవారం అజిత్ నేతృత్వంలోని వర్గానికి ఎన్‌సీపీ పేరు, గుర్తును కేటాయించింది.
  • గతేడాది జులైలో ఏకనాథ్ షిండే మంత్రివర్గంలోకి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భుజ్‌బల్‌కు ఇలాంటి హత్య బెదిరింపు ఒకటి వచ్చింది . 24 ఏళ్ల యువకుడు భుజ్‌బల్‌ పీఏకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు భుజ్‌బల్ సుపారీ (కాంట్రాక్ట్) వచ్చిందని, అతన్ని చంపేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నిందితుడిని పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.
  • గతంలో శరద్ పవార్ విధేయుడైన భుజబల్, శరద్ పవార్ వర్గాన్ని వీడి అజిత్ పవార్ గ్రూపులో చేరడం రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసింది.

Also Read : Rythu Bandhu Update : రైతు బంధు నిబంధనల్లో మార్పు.. కౌలు రైతులకూ సాయం

  Last Updated: 10 Feb 2024, 03:47 PM IST