Delhi Assembly Elections : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాలయం వేదికగా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మేనిఫెస్టోలోని కీలక వివరాలను వెల్లడించారు. తమ సంకల్ప పత్రం వికసిత ఢిల్లీకి పునాదులు వేస్తుందని నడ్డా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
జేపీ నడ్డా ప్రకటించిన కీలక హామీలివే..
. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ‘మహిళా సమృద్ధి యోజన’ ద్వారా ఢిల్లీ మహిళలకు ప్రతినెలా . . . . . .రూ.2,500 ఆర్థిక సాయం.
. ఢిల్లీలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు. అదనంగా రూ.5 లక్షల హెల్త్ కవర్.
. ఆప్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు.
. పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ.
. 60 నుంచి 70 ఏళ్లలోపు సీనియర్ సిటిజెన్లకు ప్రతినెలా రూ.2,500 పింఛను.
. 70 ఏళ్లకుపైబడిన వారికి రూ.3వేల పింఛను.
. ఢిల్లీలోని ‘ఝగ్గి-ఝోప్డీ’ (జేజే) క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. అక్కడి పేదలకు రూ.5కే పోషకాహారం. జేజే క్లస్టర్లు అంటే అనధికారిక సెటిల్‌మెంట్లు/మురికివాడలు.
జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నగర వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు కొత్తగా చర్యలు తీసుకుంటూ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. 2014లో తాము 500 వాగ్దానాలు చేశామని, 499 వాగ్దానాలను అమలు చేశామని, 2019లో 235 వాగ్దానాల్లో 225 నెరవేర్చామని చెప్పారు. తక్కినవి కూడా వివిధ దశల్లో అమలుకు సిద్ధమవుతున్నాయని నడ్డా చెప్పారు. బడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్నివర్గాలను సంక్షేమానికి పార్టీ కృషి చేస్తుందన్నారు.
Read Also: AP Govt : పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన