Site icon HashtagU Telugu

AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్

Rs.18 thousand per month for priests: Arvind Kejriwal

Rs.18 thousand per month for priests: Arvind Kejriwal

AAP : ఢిల్లీలో త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి విజయం సాధిస్తే దేవాలయాల పూజారులు, గురుద్వారాల గాంథిలకు నెలకు రూ.18 వేల వేత్తనాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ కోరుకుంటుంది.

పూజారీలు మరియు గ్రంథిలు మన సమాజంలో ఒక ముఖ్యమైన భాగం, కానీ వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మేము అధికారంలోకి వస్తే రూ.18,000 జీతం చెల్లిస్తాం. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను అని కేజ్రీవాల్ తెలిపారు. పూజారులు, గ్రాంథిలు మన దేవుళ్లకు వారధిగా ఉంటున్నారని కొనియాడారు. ఇక..రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని బీజేపీని తాను అభ్యర్థిస్తున్నానని, ఈ ప్రక్రియను అడ్డగిస్తే పాపం చేసినట్లే అవుతుందని కేజ్రీవాల్ హెచ్చరించారు.

కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆప్ పార్టీ వరుసగా ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది. సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ ఉంటుంది. మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేస్తామని ఆప్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా సీనియర్ సిటిజన్ల కోసం “సంజీవని” పథకం, ఆ తర్వాత “మహిళా సమ్మాన్ యోజన” తాజాగా అర్చకులకు నెలవారీ వేతన పథకాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

Read Also: Rohit Sharma : టీం ఇండియా ఓటమి పై రోహిత్ కామెంట్స్