11500 Railway Jobs : రైల్వే జాబ్స్‌కు నేటికీ మంచి క్రేజ్ ఉంది. ఎంతోమంది యువత రైల్వే జాబ్స్ కోసం నిత్యం ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారికి ఆర్ఆర్బీ గుడ్ న్యూస్ చెప్పింది. 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో గ్రాడ్యుయేట్ కేటగిరిలో 8,113 పోస్టులు ఉన్నాయి. వీటిలో.. 3,144 గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు, 1,736 కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు, 1,507 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 994 స్టేషన్ మాస్టర్ పోస్టులు, 732 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్‌కు(11500 Railway Jobs) ఎంపికయ్యే వారికి రూ.29,200 నుంచి రూ.35,400 దాకా నెలవారీ పే స్కేల్ లభిస్తుంది. అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read :Clash In Surat : సూరత్‌లో ఉద్రిక్తత.. గణేశ్ మండపంపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకలు
మొత్తం 11,558 పోస్టులలో 3,445 అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరిలో ఉన్నాయి. వీటిలో 2,022 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు, 990 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 72 ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారికి నెలవారీ పే స్కేలు రూ.19,900 నుంచి రూ.21,700 దాకా ఉంటుంది.
Also Read :BiggBoss 8 Telugu : బై బై బేబక్క.. బిగ్ బాస్ 8 అసలు ఆట మొదలు..!
గ్రాడ్యుయేట్ కేటగిరి పోస్టులకు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 13 వరకు అప్లై చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరి పోస్టులకు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 20 వరకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు సెప్టెంబర్ 14న విడుదలవుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500. మహిళలు, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.250.