Site icon HashtagU Telugu

Raod Crack : చెన్నైలో ఒక్కసారిగా చీలిన రోడ్డు.. భయాందోళనలో ప్రజలు

Road Crack

Road Crack

Road Crack : చెన్నై నగరంలోని పెరుంగుడి రైల్వే స్టేషన్‌ సమీపంలో వందలాది ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిలో భారీగా పగుళ్లు రావడం కలకలం రేపుతోంది. సుమారు 70 మీటర్ల మేర రోడ్‌పై పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం సమయంలో జరిగింది.

ప్రతి రోజు వందల మంది ప్రయాణికులు, విద్యార్థులు ఈ రహదారిలో కదలాడుతుంటారు. అలాంటి రహదారిలో ఒక్కసారిగా పగుళ్లు ఏర్పడటం చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. పెరుంగుడి రైల్వే స్టేషన్‌ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ సలై వరకు ఈ క్రాక్ కనిపించింది. కొందరు సైకిళ్లపై వెళ్తుండగా రోడ్ ఒక్కసారిగా కిందికి కూర్చినట్లు అనిపించిందని స్థానికులు చెప్పారు.

ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు, భూగర్భ మార్గం తవ్వకాలు వంటి కారణాల వల్లే ఈ పగుళ్లు వచ్చాయని అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడికి వెంటనే చేరుకున్న మెట్రో అధికారులు, రోడ్డు మున్సిపల్ ఇంజినీర్లు, IIT మద్రాస్ నిపుణులు రహదారి పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమికంగా భూమిలో లోపల ఉన్న ఒత్తిళ్లు వల్లే ఈ పగుళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు.

చెన్నై కరపొరేషన్ కమిషనర్ అల్తాఫ్ ముల్తానీ రసూల్ స్థానిక స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రహదారి పూర్తిగా పునర్నిర్మాణం చేసి తర్వాతే ప్రజలకు అనుమతి ఇస్తామని చెప్పారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో మెట్రో పనులు, నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. అవి సరైన పద్ధతిలో లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. “రోజూ మన పిల్లలు ఈ దారిలో స్కూల్‌కు వెళ్తారు. ఒక్కసారి ఏమైనా జరిగితే?” అని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Nepal : శ్రీరామ జన్మస్థలంపై మళ్లీ వివాదం.. నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు