రోడ్ ప్రమాదాలు (Road Accidents) ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటి నుండి వెళ్లిన వ్యక్తి..తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఆ తీరుగా ఉంది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తులో వాహనాలు నడపడం ఇలా పలు కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా కర్ణాటక (Karnataka )లోని చిక్ బళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది మృతి చెందారు.
గొరంట్ల (Gorantla village)కు చెందిన వీరంతా టాటా సుమో (Tata Sumo)లో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమోలో మొత్తం 14 మంది ఉండగా.. వారిలో 13 మంది (13 Killed) చనిపోయారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన చిక్ బళ్లాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
ఈ ప్రమాదం ఫై ఏపీ సీఎం జగన్ (CM Jagan) స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందంటూ ట్వీట్ చేశారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని ట్వీట్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also : YCP ‘Samajika Sadhikara’ Bus Yatra : వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం