Site icon HashtagU Telugu

370 Seats – EVM : ప్రధాని మోడీ ‘370’ కామెంట్.. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందేమోనన్న విపక్ష ఎంపీలు

370 Seats Evm

370 Seats Evm

370 Seats – EVM : ‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలువురు విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు. వివాదాస్పద కామెంట్స్‌తో ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఆర్టికల్ 370ని తీసేసినందుకు 370 సీట్లు వస్తాయనుకుంటున్నారా ? : అధిర్

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను తారుమారు చేయడంలో ప్రధాని నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. ఎవరైనా గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నారంటే.. ఈవీఎంలలో ఏమైనా రహస్యాలను దాచి ఉంచొచ్చు. మోడీ మాటలను బట్టి చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది’’ అని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు జరగక ముందే బీజేపీ 370 సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీ ఎలా చెప్పగలిగారని అధిర్ ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని తీసేసినందుకు 370 సీట్లు(370 Seats – EVM) వస్తాయనుకుంటున్నారో ఏమో అని ఆయన ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని ఓటు వేయడానికి ముందే గెలిచే సీట్ల సంఖ్యను చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘‘ఓట్లు అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు కావు. మోడీ అంత నమ్మకంతో గెలవబోయే సీట్ల సంఖ్యను ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు’’ అని అధిర్ కామెంట్ చేశారు.

Also Read :Miss Japan Exposed : కొంపముంచిన అఫైర్.. కిరీటాన్ని వెనక్కి ఇచ్చేసిన ‘మిస్ జపాన్’

ఎంపీ మనోజ్ ఝా ఏమన్నారంటే..

ఇదే అంశంపై ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా తీవ్ర స్థాయిలో ప్రధానిపై విరుచుకుపడ్డారు.. ‘‘ప్రధాని మోడీ లోక్‌సభలో చేసిన కామెంట్స్‌ను బట్టి ఈవీఎం ఇప్పటికే సెట్ అయిపోందని అనిపిస్తోంది’’ అని ఆరోపించారు. మనోజ్ ఝా మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోడీ బీజేపీకి  370, ఎన్డీయేకు 400 లోక్‌సభ సీట్లు వస్తాయని చెబుతున్నారు. రిగ్గింగ్ (ఓట్లను దొంగిలించే వ్యవస్థ) పని పూర్తయిందని.. ఈవీఎంలు సెట్ అయ్యాయని దీని అర్థం’’ అని ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధానమంత్రి. కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి అఖండ మెజారిటీతో గెలుస్తామని చెబితే ఇబ్బందేం ఉండదు. కానీ 370 సీట్లను గెలిచి తీరుతామని చెప్పేసరికి సందేహం పుట్టుకొస్తుంది’’ అని మనోజ్ ఝా కామెంట్ చేశారు. ‘‘గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు. అయినప్పటికీ 370 లోక్‌సభ స్థానాల్లో గెలవడంపై కలలు కనడం వేస్ట్. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామనని 2014లో ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్క ఏడాది కూడా కనీసం 20 లక్షల జాబ్స్ ఇవ్వలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.