Rishi Sunak : ‘‘రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం’’ గురించి చరిత్రలో మనం చదువుతుంటాం. రవి అంటే సూర్యుడు. రవి రోజూ ఉదయాన్నే ఉదయిస్తాడు. సాయంత్రం కాగానే అస్తమిస్తాడు. ‘‘రవి అస్తమించని’’ అంటే ‘‘చీకటి ఎరుగని’’ అనే అర్థం వస్తుంది. అఖండ భారత్ సహా ప్రపంచం నలుమూలలా ఎన్నో దేశాలపై కర్ర పెత్తనం చేశారు బ్రిటీష్ వాళ్లు. అలాంటి బ్రిటీష్ గడ్డకు మన భారతీయుడు ఒకరు ప్రధానిగా సేవలు అందించాడు. తెల్లజాతి వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఆయనే రిషి సునాక్. రిషి ఇవాళ భారత గడ్డ సాక్షిగా క్రికెటర్‌గా మారారు. ఆ వివరాలు చూద్దాం..
No trip to Mumbai would be complete without a game of tennis ball cricket. pic.twitter.com/UNe6d96AFE
— Rishi Sunak (@RishiSunak) February 2, 2025
Also Read :Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?
బ్యాటింగ్ మెరుపులు..
ఇవాళ(ఆదివారం) దక్షిణ ముంబైలోని పార్సీ జింఖానా మైదానం వేదికగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. మైదానం నలుమూలలా పరుగుల వరదను పారించారు. బౌండరీలతో తడాఖా చూపించారు. కవర్ డ్రైవ్ షాట్లు కొట్టి శభాష్ అనిపించారు. హెల్మెట్ లేకున్నా ఫాస్ట్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడారో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ
జైపూర్‌కు వెళ్లి..
రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రిషి సునాక్(Rishi Sunak) భారత్‌కు వచ్చారు. శనివారం రోజు జైపూర్‌కు వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా రిషి ముంబై నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ముంబైలో పార్సీ జింఖానా క్లబ్ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. క్లబ్ ఆహ్వానం మేరకు ఇవాళ (ఆదివారం) ఉదయం నగరంలోని పార్సీ జింఖానా మైదానానికి రిషి వెళ్లారు. ఆ మైదానంలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఒక టీమ్‌లోకి చేరి, వారి తరఫున రిషి సునాక్ బ్యాటింగ్ చేశారు. అక్కడున్న యువ క్రికెటర్లను ఉత్సాహపరిచారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అనంతరం రిషి సునాక్ ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా నా ముంబై పర్యటన ఎప్పుడూ ముగియదు’’ అని ఆయన రాసుకొచ్చారు.