Site icon HashtagU Telugu

Manipur : మణిపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేత

Restrictions on internet lifted in Manipur districts

Restrictions on internet lifted in Manipur districts

Restrictions on internet lifted in Manipur districts : మణిపూర్‌లో ఈరోజు నుండి అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. తక్షణమే ఆ ఆదేశాల్లో అమలులోకి వచ్చేశాయి. రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల పరిస్థితిపై సమీక్షించినట్లు హోంశాఖ కమీషనర్ ఎన్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన బ్రాడ్‌బ్యాండ్ సేవలను పాక్షికంగా ప్రారంభించారు.

Read Also: Kerala : కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. మళ్లీ మాస్కులు తప్పనిసరి

విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఇంపాల్ ఈస్ట్‌, ఇంపాల్ వెస్ట్‌, బిష్ణుపుర్‌,తౌబాల్‌, కాచింగ్ జిల్లాల్లో ఆంక్షలను విధించారు. మిలిటెంట్ల దాడి విషయంలో భద్రతా దళాలు విఫలం అయినట్లు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ నిరసనల్లో జరిగిన కాల్పుల్లో సుమారు 80 మంది మరణించారు. దీంట్లో విద్యార్థులు, పోలీసులు కూడా ఉన్నారు. కాగా, ఇంటర్నెట్‌ను పునర్ ప్రారంభిస్తున్నామని, యూజర్లు చాలా బాధ్యతాయుతంగా నెట్‌ను వాడుకోవాలని, అవసరమైన కాంటెంట్‌ను షేర్ చేయవద్దు అని సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏ రూటర్ నుండి వైఫై/హాట్‌స్పాట్ కి అనుమతి లేదు. అయితే, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందడం గురించి ఆందోళనల కారణంగా మొబైల్ ఇంటర్నెట్ డేటాపై ఆంక్షలు కొనసాగుతాయి.
ఆందోళనకారులు, నిరసనకారులు మొబైల్ ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే అవకాశం ఉండడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరుగుతుంది.

Read Also: Simbaa Movie : ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ ‘సింబా’..