Site icon HashtagU Telugu

Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

Rename Delhi

Rename Delhi

Rename Delhi: ఢిల్లీలోని చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ ఢిల్లీ (Rename Delhi) పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, ఢిల్లీ విమానాశ్రయం (ఎయిర్‌పోర్ట్) పేరును ‘ఇంద్రప్రస్థ అంతర్జాతీయ విమానాశ్రయంగా’ మార్చాలని కూడా బీజేపీ ఎంపీ అమిత్ షాకు సూచించారు.

ఖండేవాల్ లేఖలో ఏముందంటే?

భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వాలలో ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక మహానగరం మాత్రమే కాదు. భారతీయ నాగరికత ఆత్మ, ధర్మం, నీతి, లోకకళ్యాణం సంప్రదాయాలకు కేంద్రంగా ఉంది అని రాసుకొచ్చారు. తరువాత మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ.. ఢిల్లీ చరిత్ర నేరుగా పాండవుల కాలంతో ముడిపడి ఉందని, అందుకే మన ఢిల్లీ గౌరవప్రదమైన సంస్కృతి, నాగరికత, వారసత్వం, సంప్రదాయాలు ‘ఇంద్రప్రస్థ’ పేరుతో ముడిపడి ఉన్నాయని అన్నారు.

పాండవుల విగ్రహాల ఏర్పాటుకు డిమాండ్

“పాండవులు యమునా నది ఒడ్డున ఇంద్రప్రస్థ రాజధానిని స్థాపించారు” అని ఖండేవాల్ గుర్తు చేశారు. ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలలో పాండవుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. దీని ద్వారా యువ తరానికి పాండవుల సంస్కృతి, నాగరికత గురించి తెలుస్తుందని ఆయన అన్నారు.

నగరం చారిత్రక ప్రాముఖ్యతను హోంమంత్రికి వివరిస్తూ ఖండేవాల్.. “మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే యమునా తీరాన తమ రాజధాని ఇంద్రప్రస్థను స్థాపించారు. మౌర్య కాలం నుండి గుప్తుల కాలం వరకు ఇంద్రప్రస్థ వాణిజ్యం, సంస్కృతి, పరిపాలనకు ప్రధాన కేంద్రంగా ఉండేది. 11వ-12వ శతాబ్దంలో రాజపుత్రుల కాలంలో తోమర్ రాజులు దీనిని ‘డిల్లికా’ అని పిలిచేవారు. దీని నుంచే ‘ఢిల్లీ’ అనే పేరు ఉద్భవించింది” అని లేఖలో పేర్కొన్నారు.

Also Read: Toyota: మార్కెట్లోకి 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్న టయోటా!

ఇంగ్లీష్‌లో ‘Delhi’ అక్షరంపై అభ్యంతరం

నాలుగు రోజుల క్రితం అక్టోబర్ 28న మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఒక పత్రికా సమావేశంలో ఢిల్లీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంగ్లంలో ‘Delhi’ అని రాసినా.. దేశం మొత్తం దీనిని ‘దిల్లీ’ అని పలుకుతుందని అన్నారు. ఉచ్చారణ, గుర్తింపు రెండింటి గౌరవార్థం ఇప్పుడు ఆంగ్లంలో కూడా దీనిని ‘Dilli’ గా రాయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

నవంబర్ 1న ఢిల్లీ ప్రభుత్వం కొత్త అధికారిక లోగోను విడుదల చేసినప్పుడు అందులో ‘Delhi’ బదులు ‘Dilli’ అని రాయాలని గోయల్ కోరారు. “ఇది కేవలం పేరు మార్చడం కాదు ఇది మన ఆత్మ, సంప్రదాయం, చరిత్రతో ముడిపడి ఉన్న ఒక ముందడుగు” అని ఆయన అన్నారు.

ఢిల్లీ పేరు ఎలా వచ్చింది?

చారిత్రక గుర్తింపు

Exit mobile version