Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా..?

Rekha Gupta: రేఖా గుప్తా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని పొందబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు.

Published By: HashtagU Telugu Desk
Delhi Politics

Delhi Politics

Rekha Gupta: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఇది గమనార్హం. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకొని భారీ విజయాన్ని సాధించింది. రేఖా గుప్తా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని పొందబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా కూడా ఆమె పని చేశారు.

Green Chilies: పచ్చి మిరపకాయలతో కాన్సర్ దూరం.. రోజుకు ఎన్ని తినాలంటే?

రేఖా గుప్తా 1992లో రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. దౌలత్ రామ్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఆమె ఏబీవీపీలో చేరారు. 1996-97లో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యలపై ఆమె పోరాడారు, అదే సమయంలో ఆమె నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయి.

2007లో నార్త్ పీతంపురా నుండి కౌన్సిలర్‌గా గెలిచిన రేఖా, ప్రజల అనువైన వసతుల కోసం పెద్దపని చేశారు. లైబ్రరీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వసతుల అభివృద్ధి కోసం కృషి చేశారు. 2012లో కూడా కౌన్సిలర్‌గా మరోసారి గెలిచిన రేఖా, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌గా ఆమె పాలనను మెరుగుపరచుకునేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఆర్థికంగా వెనుకబడిన బాలికల విద్యా అభివృద్ధి కోసం ‘సుమేధ యోజన’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారత, బలహీన వర్గాల సంక్షేమం కోసం రేఖా గుప్తా చేసిన అనేక కార్యక్రమాలు ఆమెను మంచి నాయకురాలిగా పేరు గడించేందుకు సహాయపడాయి. ఆమె నాయకత్వంలో ఢిల్లీకి మంచి అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..

  Last Updated: 20 Feb 2025, 12:45 PM IST