తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు (Cement Prices) వినియోగదారులకు ఊరట కలిగించేలా తగ్గాయి. ఇప్పటివరకు 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో ఒక బస్తాపై సుమారు రూ.30 వరకు ధర తగ్గింది. ఈ నిర్ణయం కారణంగా కూలీలు, కాంట్రాక్టర్లు, గృహనిర్మాణం చేపడుతున్న సాధారణ ప్రజలకు పెద్ద ఊరట లభించింది. జీఎస్టీ తగ్గింపు వల్ల నిర్మాణరంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Election Commission of India : ఓటు తొలగించాలంటే ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి
బ్రాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260కి చేరగా, రూ.370 పలికిన బ్యాగు రూ.330కి తగ్గింది. ఈ తగ్గింపుతో చిన్న, మధ్యతరహా నిర్మాణ ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. పెద్ద స్థాయిలో సిమెంట్ కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఒక సానుకూల పరిణామం.
తెలుగు రాష్ట్రాల్లో నెలకు సగటున 23–25 లక్షల టన్నుల సిమెంట్ అమ్మకాలు నమోదవుతాయి. అయితే వర్షాకాలం, ధరల పెరుగుదల వంటి కారణాలతో ఇటీవలి కాలంలో సిమెంట్ విక్రయాలు కొంత తగ్గాయి. ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం నిర్మాణరంగానికి ఊపిరి పీల్చేలా మారి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక చైతన్యం పెంచే అవకాశముంది.