Reasi Terror Attack: రియాసిలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు దాడి చేయడంతో డ్రైవర్‌పై కాల్పులు జరగ్గా, బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సీనియర్ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, నటీమణులు దీనిపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి కుట్ర పన్నినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉగ్రవాదులు బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరగడంతో బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. బస్సు కాలువలో పడకపోయి ఉంటే ఉగ్రవాదులు అందర్నీ చంపేసి ఉండేవారన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం ఉగ్రవాదులు సైన్యం తరహా దుస్తులు ధరించారు. బస్సు ఆపమని దూరం నుంచి సైగ చేశారు. వాళ్ళు దగ్గరకు రాగానే డ్రైవర్ కి అర్థమైంది వీరంతా ఆర్మీ సిబ్బంది కాదని. వెంటనే బస్సును పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఉగ్రవాదులు డ్రైవర్‌ను కాల్చిచంపారు. దీంతో బస్సు కాలువలో పడిపోయింది.
బస్సులో ప్రయాణిస్తున్న వారందరినీ హతమార్చాలన్నదే ఉగ్రవాదుల ఉద్దేశమని, బస్సు కాలువలో పడిన తర్వాత కూడా తూటాలు పేల్చుతూనే ఉన్నారని భక్తులు చెబుతున్నారు.అయితే ఈ దాడిలో డ్రైవర్ ఆలా అలర్ట్ అయి ఉండకపోయి ఉంటే భక్తుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగిలి ఉండేవారు కాదన్నది సుస్పష్టం.
Also Read: Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు