Gold Mission : మన దేశపు ఖజానాలో బంగారాన్ని నింపే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అడుగులు వేస్తోంది. తాజాగా మరో 102 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి ఆర్‌బీఐ తీసుకొచ్చింది. ఇంతకీ ఎలా తీసుకొచ్చింది ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Indian Army : తప్పుడు ‘సోషల్’ పోస్టులకు చెక్.. భారత ఆర్మీకి కీలక అధికారం
తాజా గణాంకాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 854.73 మెట్రిక్ టన్నుల బంగారం(Gold Mission) ఉంది. అయితే ఇదంతా మన దేశంలోనే లేదు. 510.46 మెట్రిక్ టన్నుల బంగారం మన దేశంలోని ఖజానాలో సేఫ్‌గా ఉంది. మిగతా 324.01 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సంయుక్త కస్టడీలో ఉంది. ఈ ఏడాది మే నెలలో 100 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఆర్‌బీఐ మన దేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరో 102 టన్నుల బంగారాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. భారీ భద్రత నడుమ ఈ బంగారాన్ని మన దేశానికి తెచ్చారు. 2022 నుంచి ఇప్పటివరకు దాదాపు 214 టన్నుల బంగారం మన దేశానికి తిరిగి వచ్చింది. భవిష్యత్తులో మరింత గోల్డ్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చే అంశంపై భారత్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read :Ravanas Clan : గడ్చిరోలిలో రావణుడి వంశీకులు.. దీపావళి రోజు ఏం చేస్తారంటే..?
పశ్చిమాసియా, ఉక్రెయిన్- రష్యా, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, తైవాన్ -చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో భారత్ తన కరెన్సీ విలువను కాపాడుకునే చర్యల్లో భాగంగా బంగారం నిల్వలను స్వదేశానికి తీసుకొచ్చింది. 2024 మార్చి నాటికి భారతదేశం వద్దనున్న మొత్తం విదేశీ మారక నిల్వలలో 8.15 శాతం బంగారం ఉండగా.. 2024 సెప్టెంబరు నాటికి అది కాస్తా 9.32 శాతానికి పెరిగింది. కాగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద చాలా ప్రపంచదేశాలకు చెందిన బంగారం నిల్వలు ఉన్నాయి. వాటిని తొమ్మిది అండర్ గ్రౌండ్ వాల్ట్‌లలో భద్రపరిచారు. ఆ బ్యాంకు వద్ద దాదాపు 5,350 టన్నుల బంగారం ఉందని ఒక అంచనా. అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద గోల్డ్ కస్టోడియన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు ఖ్యాతి ఉంది.