Site icon HashtagU Telugu

Jaya Prada: నటి జయప్రద కోసం పోలీసుల గాలింపు.. కారణమిదే..?

Jaya Prada

Jaya Prada

Jaya Prada: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద (Jaya Prada) కోసం రాంపూర్ పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపి, ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న కేసులకు జయప్రద నిరంతరం గైర్హాజరు కావడమే అందుకు కారణం. కోర్టు కఠిన వైఖరి అవలంభించి జయప్రదను ఎలాగైనా కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జయప్రద ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందం ముంబై వెళ్లింది.

రాంపూర్ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆచూకీ పోలీసులకు దొరకడం లేదు. రాంపూర్ నుంచి ముంబై వరకు మాజీ ఎంపీ ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. టీమ్ ఇప్పుడు ఆమె సన్నిహితులను కూడా సంప్రదించడం ప్రారంభించింది. పోలీసులు నగరంలో ఉన్న ఆమె నర్సింగ్ కళాశాలలో కూడా సోదాలు చేసినప్పటికీ జయప్రద జాడ ఎక్కడా దొరకలేదు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ జయప్రదపై రెండు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన గత కొన్ని రోజులుగా ఆమె కోర్టుకు హాజరు కావడం లేదు.

Also Read: Inside Story : బిహార్ సీఎంను డిప్యూటీ సీఎంగా చేసేందుకు స్కెచ్.. లలన్ సింగ్ ఔట్ !?

కోర్టు ఆదేశాలతో జయప్రదను అరెస్ట్ చేసేందుకు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ముంబైకి చేరుకుంది. ముంబైలోని జయప్రద నివాసంపై కూడా ఈ బృందం సోదాలు చేసినప్పటికీ అక్కడ కూడా ఆచూకీ లభించలేదు. మూలాల ప్రకారం.. బృందం ముంబైలోని అనేక ప్రదేశాలలో శోధించింది.

పోలీసు బృందం షాజాద్‌నగర్‌లోని ఆమె నీలవేణి నర్సింగ్ కాలేజీకి కూడా చేరుకుంది. అక్కడ బృందం మాజీ ఎంపీ గురించి సమాచారాన్ని తీసుకుంది. త్వరలో మాజీ ఎంపీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. ఈ బృందం మాజీ ఎంపీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనుంది.

We’re now on WhatsApp. Click to Join.

జయప్రద 2019 ఎన్నికల్లో ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. జయప్రద ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, రాంపూర్ నుండి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు భాజపా అభ్యర్ధులలో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.