Attacks On Trains : టెర్రరిస్టు ఫర్హతుల్లా ఘోరీ విడుదల చేసిన వీడియో కలకలం క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ అతడు ఆ వీడియోలో స్లీపర్ సెల్స్‌కు ఆదేశాలు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే అతడు విడుదల చేసిన మూడు నిమిషాల సంచలన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ
భారతదేశంలోని రైళ్లు, పెట్రోలియం పైప్‌లైన్లపై దాడులు(Attacks On Trains) చేయాలని.. ప్రెజర్ కుక్కర్లు వాడి రామేశ్వరం కేఫ్ తరహా పేలుళ్లు జరపాలని ఆ వీడియో సందేశంలో ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తావించడం గమనార్హం. ఈనేపథ్యంలో భారత నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. భారత్‌లో సీక్రెట్‌గా ఉంటున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌కు ఈ పేలుళ్లు జరపడంలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సహకారం అందించే ముప్పు ఉందని భారత నిఘా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కుట్రలను భగ్నం చేసేందుకు రెడీ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఫర్హతుల్లా ఘోరీ ఎవరు ?
- ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు ఉన్నాయి.
- మన దేశంలో జరిగిన పలు పేలుళ్ల వెనక ఇతడి హస్తం ఉందని అంటారు.
- 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడితో ఫర్హతుల్లా ఘోరీకి సంబంధం ఉందని సమాచారం. ఆ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి గాయాలయ్యాయి.
- 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలోనూ అతడి ప్రమేయం ఉంది.
- కొన్ని నెలల క్రితం పుణే-ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన పలువురు ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్టుచేశారు. వారిని విచారించగా ఘోరీ పేరు తెరపైకి వచ్చింది.
- భారత్‌లో ఐఎస్‌ఐ స్లీపర్ సెల్స్‌ను ఫర్హతుల్లా ఘోరీ నిర్వహిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కొంతమంది యువతను అతడు రిక్రూట్ చేసుకుంటున్నాడని గుర్తించారు.