Site icon HashtagU Telugu

Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు

Ram Temple Rings

Ram Temple Rings

గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రామాలయ ఫొటోస్ కు , ఉంగరాలు , విగ్రహాలకు ఇలా ప్రతి వాటికీ డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారు.

అయోధ్య రామమందిరాన్ని పోలిన ఉంగరాలకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచం వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లోని వ్యాపారులు వీటిని తయారు చేస్తున్నారు. 38 గ్రాముల బరువుతో ఈ ఉంగరాలను సూరత్‌కు చెందిన ఓ ఆభరణాల తయారీ సంస్థ తయారు చేస్తుంది. మనకు కావాల్సిన సైజుల్లో ఈ ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి.వీటి ధర వచ్చేసి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు పలుకుతుంది. ప్రస్తుతం తాము 178 రింగ్‌ల కోసం ఆర్డర్‌లను అందుకున్నామని.. డిమాండ్ ను దీన్ని దృష్టిలో ఉంచుకుని 350 ఉంగరాలను సిద్ధంగా ఉంచామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె రేపు ‘ప్రాణ ప్రతిష్ఠ’ రోజున పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్ తో సహా రాష్ట్రాలు పబ్లిక్ హాలిడేగా తేల్చి చెప్పాయి. పుదుచ్చేరి, చండీగఢ్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సెలవు ప్రకటించాయి. కేరళ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు సైతం జనవరి 22 న ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్-డేగా ప్రకటించాయి.

Read Also : Milk: ఎక్కువసేపు పాలను మరిగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?