Rakul Preet Singh: ప్రఖ్యాత సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తన భర్తతో కలిసి ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ గౌరవాన్ని పంచుకుంటూ స్పందించారు. యోగా లాంటి మహత్తరమైన ఆరోగ్యదాయక ప్రక్రియను ప్రోత్సహించడంలో భాగస్వామ్యం కావడం పట్ల గర్వంగా ఉందని అన్నారు. “ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ గుర్తింపు లభించడం ఎంతో సంతృప్తికరం. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ మిషన్‌లో భాగమవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,” అని రకుల్ పేర్కొన్నారు.
రకుల్ తన సందేశంలో ఆరోగ్యానికి యోగాను ప్రధాన ఆధారంగా చూపించారు. “ఫిట్నెస్ సాధించడానికి ఎలాంటి ఖరీదైన పరికరాలు, ఫ్యాన్సీ జిమ్‌లు అవసరం లేదు. యోగా ద్వారా ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండవచ్చు,” అని ఆమె వివరించారు. అంతేకాక, “యోగా అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ఇది శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా శక్తినిస్తుంది. యోగా వల్ల జీవనశైలి మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,” అని పేర్కొన్నారు.
ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం దేశవ్యాప్తంగా యోగా స్పూర్తినిచ్చేలా ప్రభుత్వ సూచనల ప్రకారం చేపట్టిన ఈ అవార్డు కార్యక్రమంలో రకుల్ దంపతులకు వచ్చిన గుర్తింపు, యోగా ప్రమాణాలను సామాన్యులకు చేరవేయడంలో వారి పాత్రను నొక్కి చెబుతోంది.
International Yoga Day : రాత్రి భోజనం తర్వాత యోగా చేయవచ్చా..?