Operation sindoor Speech: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతున్న సమయంలో, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు మతాన్ని ప్రశ్నించి పర్యాటకులపై దారుణంగా కాల్పులు జరపడం హేయకృత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్పష్టంగా తెలియజేస్తూ, ఉగ్రవాదుల మత్తు దాటికి తగిన బుద్ధి చెప్పేందుకే “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించామని పేర్కొన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం మేమేం ఊరుకోలేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Read Also: Apples With Peel : యాపిల్ పండ్లను మీరు ఎలా తింటున్నారు ? తొక్కతో సహా తినాల్సిందే.. ఎందుకంటే..?
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదం మీదే లక్ష్యంగా సాగిందని, పాకిస్థాన్ ప్రజలకు ఏ విధంగానూ హాని చేయాలన్న ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ దాడులు సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా జరిపాం. మా లక్ష్యం ఒకటే ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయడం అని చెప్పారు. ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన దాడులకు భారత భద్రతా బలగాలు ధీటుగా స్పందించాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వారు మిస్‌ఐల్ లాంచ్ స్టేషన్ నుంచి దాడికి దిగగా, మన సైన్యం కౌంటర్ దాడులతో పాక్ మిసైల్ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి ప్రతి దాడిని సమర్థంగా తిప్పికొట్టాయి. మన వాయుసేన వినాశకరంగా ఎదురుదాడికి దిగింది. ప్రపంచం మొత్తం మన బలగాల పరాక్రమాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది అని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం యుద్ధం కాదని, ఉగ్రవాదం కూల్చివేయడమేనని ఆయన స్పష్టం చేశారు. పాక్ హద్దులు దాటి వెళ్లినది ఉగ్రవాద స్థావరాల దెబ్బతీసేందుకే. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలు, శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మన చర్యలను అనేక దేశాలు న్యాయంగా మన్నించాయి. ఇది మా ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యం. దేశాన్ని రక్షించడంలో మేము ఎప్పుడూ రాజీపడం. శాంతిని కోరుకుంటాం కానీ, అవసరమైతే ఉగ్రవాదానికి గట్టిగా బుద్ధి చెప్పగలం అని అన్నారు. ఈ ఘటనలపై పార్లమెంటులో తీవ్ర చర్చ జరుగుతుండగా, దేశవ్యాప్తంగా ప్రజలు భారత సైనికుల పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నారు. సైనికుల ధైర్యానికి, ప్రభుత్వ తక్షణ స్పందనకు సర్వత్రా మద్దతు వ్యక్తమవుతోంది. ఉగ్రదాడులకు గట్టి బదులు ఇచ్చిన ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే అవకాశం ఉంది.
Read Also: Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌కు వరంగా మారిన కోచ్ గంభీర్ మాటలు!