Site icon HashtagU Telugu

Rajasthan Government : మరో పాక్ స్పై అరెస్ట్

Rajasthan Government Employ

Rajasthan Government Employ

భారతదేశంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) నడుపుతున్న గూఢచర్యం రోజుకో కొత్త కోణాన్ని సొంతం చేసుకుంటోంది. భారత్‌లో అంతర్గత అశాంతిని సృష్టించేందుకు భారత పౌరులను ఆశపెట్టించి, తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తంతు బయటపడుతోంది. తాజాగా రాజస్థాన్‌(Rajasthan )కు చెందిన సకూర్ ఖాన్ మగళియార్ (Sakur Khan Manganiyar) అనే వ్యక్తి పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసినట్టు అనుమానంతో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సకూర్ ఖాన్ రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో పనిచేస్తుండగా, గతంలో ఒక రాష్ట్ర మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగానూ పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి కావడం విశేషం.

Mahanadu : మహానాడులో నందమూరి బాలకృష్ణ ఎక్కడ..?

సకూర్ ఖాన్ పై అనుమానంతో సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని వారాలుగా నిఘా పెట్టారు. విచారణలో అతని మొబైల్‌లో పలు పాకిస్తానీ నంబర్లు కనిపించగా, పాక్‌ను ఏడుసార్లు సందర్శించానని అతడే ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఏదైనా మిలిటరీ సంబంధిత సమాచారం లభించకపోయినా, కొన్ని కీలక ఫైళ్లను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇది గూఢచర్యానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు అవసరమని చెబుతోంది. ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటన మరోసారి ఐఎస్ఐ నెట్‌వర్క్ భారత్‌లో ఎంత లోతుగా వ్యాపించిందన్నదానికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఇలాంటి ప్రబల ప్రభావం కలిగి ఉండటం దేశ భద్రతపట్ల ఆందోళన కలిగించే అంశం. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు టార్గెట్ కావడం, వారిని ఆశలు, డబ్బు వంటి వలలతో ఆకర్షించి భారత రహస్యాలను చోరీ చేయడంలో ఐఎస్ఐ తాలూకు కుట్రలు ప్రతిసారీ బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ చౌకగూఢచారి వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.