Porn Racket Case : నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోర్న్ ఫిల్మ్‌లను తీయించి, వాటిని వివిధ మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేసిన కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇంకా పలువురికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. రేపు (సోమవారం) ఉదయం రాజ్‌కుంద్రాతో పాటు వారందరినీ ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. ఈ కేసుతో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే వివరాలను వారి నుంచి ఈడీ అధికారులు సేకరించనున్నారు.
Also Read :Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ
ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడీ(Porn Racket Case) దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముంబై, ఉత్తరప్రదేశ్‌లలోని 15 ప్రాంతాల్లో తాజాగా ఈడీ రైడ్స్ చేసింది. అయితే ఈ రైడ్స్ జరగలేదని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది వెల్లడించారు. వాటికి సంబంధించిన కథనాల్లో శిల్పాశెట్టి ఫొటో వాడొద్దని ఆయన కోరారు. ఒకవేళ ఈ కేసులో శిల్పాశెట్టి ఫొటోను వాడితే చర్యలు తీసుకుంటామని న్యాయవాది వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈడీ రైడ్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాజ్ కుంద్రా స్పందిస్తూ.. చివరకు నిజం, న్యాయమే గెలుస్తాయన్నారు. నిజాలను మాత్రమే ప్రచారం చేయాలని మీడియాను ఆయన కోరారు. గత నాలుగేళ్లుగా ఈ కేసులో తాను ఈడీ విచారణకు సహకరిస్తున్నానని రాజ్ కుంద్రా తెలిపారు. సంబంధం లేని విషయాల్లో తన భార్య శిల్పాశెట్టి పేరును పదేపదే వాడొద్దని కోరారు.
Also Read : Bapu Ghat : బాపూఘాట్ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, వీల్ ఆఫ్ లైఫ్
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన రాజ్‌కుంద్రాపై 2021లోనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆయనను అరెస్టు చేసి, కొన్ని నెలలు జైలులో పెట్టారు. సినిమా ఛాన్స్‌ల కోసం ముంబైకి వచ్చే పలువురు యువతులను మోసం చేసి వారితో పోర్న్ ఫిల్మ్‌లను రాజ్‌కుంద్రా తీయించే వారని అప్పట్లో కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పోలీసులు ప్రస్తావించారు. పోర్న్ ఫిల్మ్‌లను తీసి, వాటిని వివిధ యాప్‌లకు విక్రయించడం ద్వారా రాజ్‌కుంద్రా బాగా సంపాదించాడని ఆరోపించారు.