Retired Employees : రైల్వే శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 25వేల రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న డ్రైవ్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు సైతం ఛాన్స్ ఇస్తారని సమాచారం. రైల్వే సూపర్‌వైజర్ల నుంచి ట్రాక్‌మెన్ దాకా వివిధ పోస్టులకు రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారని అంటున్నారు. 65 ఏళ్ల లోపు వారికే ఈ ఛాన్స్ ఉంటుందని తెలిసింది. కేవలం రెండేళ్ల ఉద్యోగ కాలం కోసం వీరిని ఎంపిక చేస్తారు. రైల్వేశాఖకు అవసరమైతే పదవీకాలాన్ని పొడిగిస్తారు. దీనిపై ఇప్పటికే అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు అందాయని మీడియాలో (Retired Employees) కథనాలు వస్తున్నాయి.
Also Read :Jharkhand Elections 2024: జార్ఖండ్ ‘ఇండియా’ కూటమిలో సీట్ల పంపకాలు ఇలా..
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్‌నెస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
- పదవీ విరమణకు ముందు సదరు రైల్వే ఉద్యోగుల పనితీరు రికార్డును పరిశీలించి ఈ నియామక ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు.
- గతంలో రైల్వే విజిలెన్స్, శాఖాపరమైన చర్యలను ఎదుర్కొన్న వారు ఈ జాబ్స్‌కు అప్లై చేయడానికి అనర్హులు.
Also Read : Jharkhand Polls : జార్ఖండ్ డీజీపీపై ఈసీ వేటు.. కీలక ఆదేశాలు జారీ
- త్వరలో నియమించుకోబోయే రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు చివరిసారిగా వారు పొందిన నెలవారీ వేతనంలో నుంచి బేసిక్ పింఛనును తొలగించి శాలరీగా ఇస్తారు. ట్రావెల్ అలెవెన్స్‌లు, అధికారిక టూర్ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
- ఇంక్రిమెంట్ల వంటి బెనిఫిట్స్‌ను వీరికి ఇవ్వరు.
- ప్రస్తుతం వాయవ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 10వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
- ఇతరత్రా రైల్వే జోన్ల పరిధిలోనూ పెద్దసంఖ్యలోనే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
- రైల్వేలో పెద్దసంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ.. తగినన్ని బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయలేని దుస్థితిని రైల్వేశాఖ ఎదుర్కొంటోంది.