Site icon HashtagU Telugu

Railway Unions : మే 1 నుంచి రైళ్లన్నీ ఆపేస్తాం.. కేంద్రానికి రైల్వే యూనియన్ల వార్నింగ్

Railway Unions

Railway Unions

Railway Unions : మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధ రించకుంటే ఆందోళనకు దిగుతామని అల్టిమేటం ఇచ్చాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండును కేంద్ర సర్కారు  పట్టించుకోవడం లేదని రైల్వే సంఘాలు ఆరోపించాయి. ఈనేపథ్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప తమ ఎదుట మరో ప్రత్యామ్నాయం లేదని జాయింట్ ఫోరమ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం (జేఎఫ్ఆర్ ఓపీఎస్)  కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

పలు రైల్వే సంఘాలకు(Railway Unions) చెందిన ఉద్యోగులు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి జేఎఫ్ఆర్ఓపీఎస్ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు. జేఎఫ్ఆర్ఓపీఎస్ వేదిక తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వనుందని సమాచారం. ఇతర రైల్వే సంఘాలు కూడా తమ పోరాటంలో భాగం అవుతాయని జేఎఫ్ఆర్ఓపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పింఛను విధానం అనేది రైల్వే ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు. అందుకే తాము పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.

Also Read : Success Stories : నైట్ వాచ్‌మన్‌‌కు మూడు జాబ్స్.. గృహిణికి రెండు జాబ్స్

కొత్త పెన్షన్‌ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో దాదాపు 70 శాతం మంది నూతన పెన్షన్‌ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు. దీంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, పోస్టల్‌, టెలికం, ఐటీ, డిఫెన్స్‌ వంటి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్ధతు ఇస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో ఎస్‌సీఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌తో పాటు ఎస్‌సీఆర్‌ ఎంప్లాయిస్‌ సంఘ్‌, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్‌ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నారు.

Also Read : LAWCET 2024 : లాసెట్ దరఖాస్తు ప్రక్రియ షురూ.. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల వివరాలివీ