Khalistani State : బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ స్పందించాడు. ‘‘భారత్‌లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిక్కు మతస్తులు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో.. సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో. ఇది కేవలం సిక్కులకే పరిమితమైన అంశం కాదు. అన్ని మతాలకు సంబంధించినది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై పన్నూ రియాక్ట్ అయ్యాడు. రాహుల్ గాంధీ సాహసోపేతంగా మాట్లాడారని గురుపత్వంత్ సింగ్ పన్నూ కితాబిచ్చాడు. ప్రత్యేక ఖలిస్తానీ(Khalistani State) దేశ డిమాండ్‌ను సమర్థించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు.
Also Read :World Currency King : కాందహార్ హైజాక్ విమానంలో వరల్డ్ కరెన్సీ కింగ్.. ఏమైందో తెలుసా ?
‘‘1947 సంవత్సరం నుంచి భారతదేశంలో సిక్కులు ఎదుర్కొంటున్న వేధింపులను, అణచివేతను అద్దంపట్టేలా రాహుల్ కామెంట్స్ ఉన్నాయి’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పన్నూ ఒక పోస్ట్ పెట్టాడు. సిక్కుల మాతృభూమి ఖలిస్తాన్‌ను స్థాపించడానికి సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఆధ్వర్యంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. కాగా, ఎస్ఎఫ్‌జే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ అమెరికా మాత్రం వాటి ఆగడాలకు అడ్డాగా మారింది. అగ్రరాజ్యం కావడంతో అమెరికాపై భారత్ ఈవిషయంలో అంతగా ఒత్తిడిని పెంచలేకపోతోంది.
Also Read :RS 419 Crores Awarded : తప్పుడు కేసులో శిక్ష అనుభవించినందుకు రూ.419 కోట్ల పరిహారం
లడఖ్‌లోని 4,000 చ.కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించింది : రాహుల్ గాంధీ
లడఖ్‌లోని ఢిల్లీ అంతటి విస్తీర్ణంలో(4,000 చదరపు కిలోమీటర్లు) ఉన్న భూమిని చైనా ఆర్మీ కబ్జా చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ కబ్జాను ఆపడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోడీ విధానాలకు రాహుల్ మద్దతు ప్రకటించారు. భారత్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వల్లే న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడితే భారత్ సహించబోదని తేల్చి చెప్పారు.