Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్‌ గాంధీ

రాంబన్‌, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్‌ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi Questions The Center Of The Situation In Bangladesh

Rahul Gandhi

Rahul Gandhi : జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీ బుధవారం (సెప్టెంబర్‌ 4) నుంచి జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాంబన్‌, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్‌ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్‌ 32 స్థానాల్లో, నేషనల్‌ కాంగ్రెస్‌ 51 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సిపిఐ(ఎం), పాంథర్స్‌ పార్టీ ఒక్కో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనున్నాయి.

మరోవైపు..బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్‌, బజ్‌రంగ్‌లు రాహుల్‌తో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read Also: 30 Officials Executed : 30 మంది అధికారులను ఉరితీసిన కిమ్.. ఎందుకో తెలుసా ?

హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం సమావేశం అయింది. ఎన్నికల్లో పోటీ చేసే 34 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు హరియాణా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. నేడు అధికారికంగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో వినేశ్ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియాలు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం గమనార్హం. వినేశ్‌, పునియాలను సెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్‌ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: One Plus 13: వన్ ప్లస్ యూజర్స్ కీ గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి నయా ఫోన్ రిలీజ్!

 

 

 

 

  Last Updated: 04 Sep 2024, 01:53 PM IST