Rahul Gandhi : ఎక్కాలు నేర్చుకోలేదని 1వ తరగతి బాలుడి పట్ల టీచర్ అమానుషం.. రాహుల్ గాంధీ ట్వీట్..

ఎక్కాలు సరిగ్గా చెప్పని కారణంగా విద్యార్థిని(Studeni) టీచర్ ఇంత దారుణంగా శిక్షించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమెను వెంటనే సస్పెండ్ చేసి.. చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 09:30 PM IST

ఎక్కాలు నేర్చుకుని రాలేదని 1వ తరగతి చదివే బాలుడి పట్ల టీచర్(Teacher) అమానుషంగా ప్రవర్తించింది. ఆమె కొట్టడం కాకుండా తోటి విద్యార్థులతో గంటసేపు దారుణంగా కొట్టించింది. ఎక్కాలు సరిగ్గా చెప్పని కారణంగా ఆ విద్యార్థిని(Studeni) టీచర్ ఇంత దారుణంగా శిక్షించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమెను వెంటనే సస్పెండ్ చేసి.. చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయితే కొంతమంది దీన్ని హిందూ – ముస్లిం గొడవగా చిత్రీకరించి వైరల్ చేస్తున్నారు. ముస్లిం విద్యార్ధి కాబట్టే అలా కొట్టించారని అంటున్నారు. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగర్ లో జరిగింది.

నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. 1వ తరగతి చదువుతున్న బాధిత బాలుడు టీచర్ చెప్పిన హోమ్ వర్క్ చేయలేదు. మధ్యలో సెలవులు వచ్చినా ఎక్కాలు సరిగ్గా నేర్చుకుని రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది టీచర్. తోటి విద్యార్థులకు.. అతడిని గట్టిగా కొట్టాలని చెప్పడంతో.. గంటసేపు సదరు విద్యార్థిని కొడుతూనే ఉన్నారు. అదే సమయంలో తమ బంధువు ఎవరో స్కూల్ కు ఏదో పనిమీద వెళ్లారని, అతను వీడియో తీశాడని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. తాము ప్రిన్సిపల్ తో మాట్లాడామని, ఆ టీచర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాలుడిని తోటి విద్యార్థులతో కొట్టించిన టీచర్.. మీడియాతో మాట్లాడుతూ.. చదువు విషయంలో పిల్లాడిపట్ల కఠినంగా వ్యవహరించాలని అతని తల్లిదండ్రులే ఒత్తిడి చేసేవారని తెలిపింది. తాను దివ్యాంగురాలు కావడంతో ఇతర విద్యార్థులకు చెప్పి దెబ్బలు వేయించానని తాను చేసిన పనిని సమర్థించుకుంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు శనివారం(ఆగస్టు26) స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ అరవింద్ బంగారీ వెల్లడించారు. కాగా.. బాధిత బాలుడి గుర్తింపు తెలియజేసేలా ఉన్న ఆ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నెటిజన్లకు, మీడియాకు సూచించింది. దీనిగురించి రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నాయకులు ట్వీట్స్ చేస్తూ రాజకీయం చేయడం గమనార్హం.

 

Also Read : East Godavari : సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని చావబాదిన గ్రామ వాలంటీర్