బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బెగుసరాయ్ పర్యటనలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ సమావేశాలు, రోడ్‌షోలు, ప్రసంగాలతో మమేకమయ్యే రాహుల్ ఈసారి తన సౌమ్య స్వభావాన్ని, ప్రజలతో కలిసిపోవాలన్న తపనను మరోసారి చూపించారు. బెగుసరాయ్‌లోని ఓ గ్రామంలో చెరువు పక్కన ఆగిన ఆయన అక్కడున్న జాలర్లతో కాసేపు ముచ్చటించారు. ఆతరువాత స్వయంగా చెరువులోకి దూకి వారితో కలిసి చేపలు పట్టారు. ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. రాహుల్‌తోపాటు డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహానీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ తదితరులు కూడా ఆయన వెంట నీటిలోకి దిగారు.
Rajagopal : యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
చెరువులో కాసేపు ఈత కొడుతూ, జాలర్లతో నవ్వులు పంచుకుంటూ రాహుల్ గాంధీ పూర్తిగా ఆ వాతావరణంలో కలిసిపోయారు. ఆయనతో పాటు వచ్చిన స్థానిక నాయకులు కూడా ఈ క్షణాలను ఆస్వాదించారు. గ్రామీణ జీవన విధానాన్ని దగ్గరగా అనుభవిస్తూ, మత్స్యకారుల సమస్యలు, వారి జీవనశైలి గురించి తెలుసుకున్నారు. సాధారణ ప్రజలతో ఇంత సులభంగా మమేకమయ్యే రాహుల్ తీరు అక్కడి ప్రజల మనసులను గెలుచుకుంది. కొందరు ఆయనతో కలిసి ఫోటోలు దిగగా, మరికొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి.
రాహుల్ గాంధీ ఈ సన్నివేశం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రజలతో ఇంత సన్నిహితంగా మెలగడం ఆయనకు సహజమని కాంగ్రెస్ వర్గాలు చెబుతుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది ఎన్నికల ప్రాచార నాటకం మాత్రమేనని విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఇంత సహజంగా వ్యవహరించడం ఆయనకు ఒక పాజిటివ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. బెగుసరాయ్ పర్యటనలో చేపల వేటలో పాల్గొన్న ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో కొత్త చైతన్యాన్ని రేపింది.
