Site icon HashtagU Telugu

Savarkar : వీర సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీకి పూణే కోర్టు సమన్లు

Rahul Gandhi Vinayak Damodar Savarkar

Savarkar : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మరోసారి సమన్లు జారీ అయ్యాయి. వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును విచారించిన మహారాష్ట్రలోని పూణే ప్రత్యేక కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ‘‘ఒకసారి ఐదారుగురు స్నేహితులతో కలిసి ఓ ముస్లిం వ్యక్తిపై దాడి చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని ఒక పుస్తకంలో స్వయంగా వి.డి.సావర్కర్  రాసుకొచ్చారు’’ అని 2023 మార్చిలో లండన్‌లో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అవాస్తవమని, వీర సావర్కర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రాహుల్ గాంధీ అలా మాట్లాడారంటూ పోలీసులకు  సత్యకి సావర్కర్‌ ఫిర్యాదు చేశారు. ఈ అభియోగానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లో పోలీసులు తేల్చారు. గత నెలలోనే ఈ కేసును జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (ఎఫ్‌ఎంఎఫ్‌సీ) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. తాజాగా పూణేలోని  ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు దీనిపై విచారణ జరిపి రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రాహుల్‌‌గాంధీని ఆదేశించింది.

Also Read :Nagarjuna : నాగార్జున‌పై కేసు నమోదు చేయండి.. పోలీసులకు భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదు

రాహుల్‌గాంధీ గతంలో ‘మోడీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు కూడా పరువు నష్టం కేసును(Savarkar) ఎదుర్కొన్నారు. అప్పట్లో సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఆయన రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో అప్పట్లో ఎంపీ పదవిని రాహుల్ కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా సిక్కులపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపైనా రాజకీయ దుమారం రేగుతోంది. ఇటీవలే కర్ణాటక రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత గుండూరావు కూడా వీర సావర్కర్‌పై నోరు పారేసుకున్నారు. సావర్కర్ గోమాంసం కూడా తినేవారంటూ వివాదాస్పద కామెంట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్.. తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read :600 Massacred : 600 మందిని పిట్టల్లా కాల్చి చంపిన ఉగ్ర రాక్షసులు