Site icon HashtagU Telugu

Rahul Gandhi Arrest : రాహుల్‌ గాంధీని అరెస్టు చేస్తాం అంటూ అస్సాం సీఎం ప్రకటన

Rahul Assam

Rahul Assam

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections) తర్వాత అరెస్టు ( Arrest) చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో హింసను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలపై అసోం పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చేసారు. దీనిపై సీఎం హిమంత బిశ్వ శర్మ సిబ్సాగర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ను అరెస్టు ఖాయమని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకుంటే దానిని రాజకీయ ఎత్తుగడగా ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. యాత్ర (Bharat Jodo Nyay Yatra) పేరుతో అస్సాంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాంగ్రెస్‌ నాయకుల ఉద్దేశమని హిమంత బిశ్వశర్మ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని..ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తలను రెచ్చగొట్టారు. దానికి సంబంధించి మా వద్ద ఆధారాలున్నాయి” అని సీఎం హిమంత పేర్కొన్నారు. సమగ్ర విచారణ కోసం దీన్ని సీఐడీకి బదిలీ చేశామని అస్సాం డీజీపీ జీపీ సింగ్‌ వెల్లడించారు. అంతకుముందు, బారికేడ్‌ను బద్దలు కొట్టడానికి ప్రజలను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

బారికేడ్లను తొలగించిన కాంగ్రెస్ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా గాయపడ్డారు.

Read Also : 6 IAS Transferred in Telangana : తెలంగాణలో పలువురు IASల బదిలీ