Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘మా అమ్మకు ఇష్టమైనది’’ అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన పోస్టుకు విశేష స్పందన వచ్చింది. ఈ పోస్టులో రాహుల్ గాంధీ ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. సోనియాగాంధీజీకి తాను కానీ, ప్రియాంకాగాంధీ కానీ ఫేవరేట్ కాదని.. నూరీయే ఫేవరేట్ అని ఆయన తెలిపారు. ఇంతకీ నూరీ ఎవరు అని అనుకుంటున్నారా ? నూరీ అనేది సోనియాగాంధీ ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క. ఇది జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి కుక్క. బుట్టలో నూరీని కూర్చొబెట్టుకొని.. ఆ బుట్టను వీపునకు తగిలించుకొని సోనియాగాంధీ నడుస్తున్న రెండు ఫొటోలను పోస్టులో రాహుల్ గాంధీ(Rahul Gandhi) జతపరిచారు.
We’re now on WhatsApp. Click to Join
ఆ బుట్టలో ఉన్న నూరీయే మా అమ్మకు ఫేవరేట్ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందించారు. ఈ పోస్టుకు దాదాపు 7.81 లక్షల లైకులు వచ్చాయి. దాదాపు 5,400 కామెంట్స్ వచ్చాయి. ఇంతకీ ఈ నూరీ కుక్క ఎక్కడిది అనుకుంటున్నారా ? దాన్ని గత సంవత్సరమే ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా తన తల్లికి రాహుల్ గాంధీ గిఫ్టుగా ఇచ్చారు. 2023 సంవత్సరం ఆగస్టులో ఉత్తర గోవా పట్టణం మపుసాలోని ఒక కుక్కల పెంపకం కేంద్రం నుంచి నూరీని రాహుల్ గాంధీ కొన్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆ కుక్కను తన తల్లి సోనియాకు బహుమతిగా అందించారు.
Also Read :Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్
గతంలో నూరీ కుక్కను నెటిజన్లకు పరిచయం చేస్తూ.. ‘‘ప్రేమకు షరతులు, హద్దులు ఉండవని జంతువులు మనకు నేర్పుతాయి. కొన్ని నెలలుగా నూరీ మాతోనే ఉంటోంది. అది మా జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది’’ అని పేర్కొంటూ రాహుల్ గాంధీ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. కుక్కలను గాంధీ ఫ్యామిలీ పెంచడం ఇదే తొలిసారేం కాదు. గత కొన్నేళ్లలో వారు చాలా కుక్కలనే ఇంట్లో పెంచారు. వాటిలో ఒకటే ఈ నూరీ.