Site icon HashtagU Telugu

Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు. అటు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో తన విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు. మీర్జాపూర్‌లో జరిగిన ర్యాలీలో అయన ప్రసంగిస్తూ, సమాజ్‌వాదీ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఎస్సి, ఎస్టీ, ఓబిసి సామజిక వర్గాల హక్కులను లాక్కోవడానికి పూనుకున్నారు అని అన్నారు.

ఇదిలావుండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఫిరోజ్‌పూర్‌లోని టౌన్ హాల్ సమావేశానికి కేజ్రీవాల్ హాజరయ్యారు, ఆ తర్వాత మధ్యాహ్నం హోషియార్‌పూర్‌లో ర్యాలీ మరియు సాయంత్రం భటిండాలో రోడ్‌షోలో ప్రసంగిస్తారు.

నిన్న లోకసభ 6వ దశ ఎన్నికల ఓటింగ్ శాతం సుమారుగా రాత్రి 9.30 గంటలకు 59.62 శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 78.20 శాతం, జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పంగా 52.92 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 55.85 శాతం, బీహార్‌లో 54.49 శాతం, జార్ఖండ్‌లో 63.27 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం, ఒడిశాలో 60.07 శాతం, హర్యానాలో 59.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Also Read: IPL 2024 Prize Money: ఐపీఎల్ ట్రోఫీ విజేత‌, ర‌న్న‌ర‌ప్‌ల‌కు ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?