Production Moving To China : ఉత్పత్తి రంగంలో చైనా రారాజు.. భారత్ తలుచుకున్నా అది సాధ్యమే : రాహుల్ గాంధీ

ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తి రంగంలో చైనాదే ఆధిపత్యం ఉంది’’ అని రాహుల్ గాంధీ(Production Moving To China) చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi Production Moving To China

Production Moving To China : ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు, అమెరికా, ఐరోపా దేశాలు, భారత్‌లు ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి.. దాన్ని చైనా చేతిలో పెట్టాయని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి రంగంలో చైనాతో పోటీపడగల సత్తా భారత్‌కు ఉందని.. భారతదేశంలో నైపుణ్యాలు కలిగిన వారి కొరత లేదన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఉత్పత్తి రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే భారతదేశం, అమెరికా, పశ్చిమ దేశాలలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్నారు. ఫలితంగా చైనా ప్రపంచ ఉత్పత్తి రంగంలో  ఆధిపత్యం చలాయించే స్థాయికి ఎదిగిందని ఆయన తెలిపారు. ఉత్పత్తి రంగంపై భారత్ ఫోకస్ చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ‘‘ఉత్పత్తి రంగం వికాసం కోసం వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ మధ్యనున్న గ్యాప్‌ను తొలగించాలి. వివిధ ఉత్పత్తి కార్యకలాపాలపై యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి. దీనివల్ల వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రజల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీరియస్‌గా వర్క్ చేశాయి కాబట్టే..  ప్రస్తుతం వియత్నాం, చైనా దేశాల్లో నిరుద్యోగ సమస్య లేదన్నారు.

Also Read :Terrorists Encounter in Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం

‘‘1940, 1950వ దశకాల్లో ప్రపంచ ఉత్పత్తి హబ్‌గా అమెరికా ఉండేది. కార్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు అన్నీ అమెరికాలోనే తయారయ్యేవి. క్రమంగా ఆ స్థానాన్ని దక్షిణ కొరియా,  జపాన్ దేశాలు సొంతం చేసుకున్నాయి. చివరగా అమెరికా ప్లేస్‌ను చైనా సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తి రంగంలో చైనాదే ఆధిపత్యం ఉంది’’ అని రాహుల్ గాంధీ(Production Moving To China) చెప్పారు. మొత్తం నాలుగు రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ ఆదివారం రోజే అమెరికాకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం వాషింగ్టన్ డీసీలో పలువురు అమెరికా ప్రభుత్వ చట్టసభ సభ్యులు, సీనియర్ అధికారులను రాహుల్ గాంధీ కలవనున్నారు.

  Last Updated: 09 Sep 2024, 10:20 AM IST