Site icon HashtagU Telugu

Rahul Gandhi: కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ పై రాహుల్

Rahul Gandhi

New Web Story Copy (35)

Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ మహాసంగ్రామం కోసం పార్టీలన్నీ తమ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ పోరుకు కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ప్రజల్లోకి వెళ్లి స్వయంగా వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా రాహుల్ ప్రజల మధ్యన ఉంటూ ఆకట్టుకుంటున్నారు. లారీ నడుపుతూ లారీ డ్రైవర్ల బాధలను విన్నారు. వ్యవసాయ పొలంలోకి దిగి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాజాగా లడఖ్‌లో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ కనిపించాడు. రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లడఖ్ రోడ్లపై బైక్ నడుపుతున్న ఫోటోను షేర్ చేశారు. రాహుల్ ఫోటోపై నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ పెడుతున్నారు. ధూమ్ 4 నిజమైన హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కెటిఎమ్ 390 డ్యూక్ మోటార్‌సైకిల్‌పై రాహుల్ లడఖ్ రోడ్ల మీదుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆగస్టు 25 వరకు ఆయన లడఖ్‌లోనే ఉంటారు. నిన్న శుక్రవారం లేహ్‌లో యువతతో రాహుల్ ముచ్చటించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆదివారం తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్ సరస్సులో నివాళులర్పిస్తారు. అనంతరం కార్గిల్ వెళ్లి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Also Read: Ratan Tata – Udyog Ratna : రతన్‌ టాటాకు ‘ఉద్యోగ రత్న’ అవార్డు