Rahul Gandhi : మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్‌ గాంధీ

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 02:57 PM IST

Rahul Gandhi: మరో వివాదం(dispute)లో చిక్కుకున్నారు కాంగ్రెస్‌(Congress)అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఇటీవల రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) యూనివర్శిటీ హెడ్‌ల ఎంపిక(Selection of University Heads) ప్రక్రియపై ప్రశ్నలు సంధించారు. అయితే దీనిపై తమ వ్యతిరేకతను తెలుపూతూ..పలు యూనివర్సటీల వైస్‌ చాన్సలర్లు, మాజీ వీసీలతో సహా 181 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారు నియామక ప్రక్రియకు సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వైస్-ఛాన్సలర్లను మెరిట్ కంటే సంస్థకు అనుబంధం ఆధారంగా మాత్రమే నియమిస్తున్నారని కాంగ్రెస్ రాహుల్ ఆరోపించారు. లేఖలో రాహుల్ వాదనలను వీసీలు తోసిపుచ్చారు. వైస్-ఛాన్సలర్ల ఎంపిక ప్రక్రియ కఠినంగా, పారదర్శకంగా ఉంటుందని.. ప్రతిభ, అకడమిక్ ఎక్సలెన్స్, సమగ్రత వంటి విలువలను కలిగి ఉందని పేర్కొన్నారు. ఎంపిక పూర్తిగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. విశ్వవిద్యాలయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉంటుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) వైస్-ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్, ఢిల్లీ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం సహా వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు లేఖపై సంతకాలు చేశారు. వైస్ ఛాన్సలర్ ఎంపిక ప్రక్రియ పూర్తిగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌పై ఆధారపడి యూనివర్సిటీలను ముందుకు తీసుకెళ్లే దృక్పథంతో ఉందని చెప్పారు.

విద్యావేత్తలు తమ లేఖలో రాహుల్ గాంధీ నిర్దిష్ట వాదనను ఉదహరించలేదు. అయితే విద్యాసంస్థల్లో నియామకాల్లో హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధమే ప్రధాన ప్రాతిపదిక అని రాహుల్ ఇటీవల ఆరోపించారు.

Read Also: Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం

కొన్ని సంస్థలతో సంబంధాల ప్రాతిపదికన, అర్హతలను దృష్టిలో ఉంచుకుని యూనివర్శిటీలలో వైస్ ఛాన్సలర్ల నియామకం జరుగుతోందని రాహుల్ గాంధీ ఇటీవల తన ప్రకటనల్లో పేర్కొన్నట్లు మీడియా కథనం. రాహుల్ గాంధీ ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ చాలా మంది వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు విశ్వవిద్యాలయాల అధిపతుల ఎంపిక న్యాయమైన, పారదర్శక ప్రక్రియగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, అకడమిక్ లీడర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఇటీవల వచ్చిన నిరాధార ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.