Site icon HashtagU Telugu

Rahul Gandhi : రైల్వే కూలీగా మారిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Interacts With Coolies In Delhi

Rahul Gandhi Interacts With Coolies In Delhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)..రైల్వే కూలీ (Railway Coolie)గా మారాడు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టినప్పటి నుంచి రాహుల్ ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యనే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు.. రైతులతో కలిసి దుక్కి దున్ని నాట్లు వేసాడు.. మెకానిక్‌ని కలిసి బైక్ రిపేర్ చేయడం నేర్చుకున్నారు.. అలాగే డెలివరీ బాయ్స్ కష్టాలను తెలుసుకున్నారు. ఇలా నిత్యం ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇప్పుడు రైల్వే కూలీగా (Railway porter) మారాడు. స్వయంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఎర్ర చొక్కా తొడుక్కొని.. సూట్ కేసులు నెత్తిన పెట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Read Also : Divorce in 3 Minutes : పెళ్ళైన నిమిషాల వ్యవధిలో విడాకులు తీసుకున్న జంట.. ఎందుకలా..?

కొద్దిరోజుల క్రితం ఆనంద్ విహార్‌ రైల్వే స్టేషన్‌కు చెందిన కూలీలు ఓ వీడియోను విడుదల చేశారు. రాహుల్ గాంధీ తమను కలవాలని.. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఉందని వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఆ వీడియో రాహుల్ గాంధీ కంట పడింది. దీంతో గురువారం ఉదయం రాహుల్ గాంధీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ముందుగా సాధారణ పౌరుడిగా రైల్వే స్టేషన్ అంతా కలియ తిరిగారు. ఆ తర్వాత రైల్వే కూలీలను కలిశారు. వారితో కలిసి కూర్చొని.. వారి బాధలు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే కూలీల ఎర్ర చొక్కాను ధరించి.. చేతికి కూలీ బ్యాడ్జీ కట్టుకొని, సూట్ కేసులను మోశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.