Site icon HashtagU Telugu

Rahul Gandhi : మోదీ ప్రభుత్వం ఉత్పత్తులన్నింటినీ చైనాకు అప్పగిస్తుంది – రాహుల్

కేంద్రంలో మోదీ ప్రభుత్వం (Modi Govt) దేశీయ ఉత్పత్తుల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వకుండా, వాటిని చైనా ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత్‌లో తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందకుండా ప్రభుత్వ విధానాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో సామాజిక అశాంతి పెరిగిందని, ఈ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఉత్పత్తుల పెంపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. మేకిన్ ఇండియా పథకం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికీ, ఆశించిన ప్రయోజనాలు మాత్రం అందలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

BRS MLAs’ Defection Case : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు

సాఫ్ట్‌వేర్ విప్లవం భారతదేశ ఆర్థిక రంగాన్ని మార్చిన విధంగా, తయారీ పరిశ్రమలో కూడా ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని రాహుల్ సూచించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దేశీయ సంస్థలను సరైన విధంగా ప్రోత్సహించకుండా, విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. భారతదేశం తయారీ హబ్‌గా మారాలని భావించినప్పటికీ, ఆ దిశగా పెద్దగా పురోగతి కనిపించడంలేదని ఆయన అన్నారు. చాలా సంస్థలు భారతదేశంలో తయారీ అవకాశాలను పెంచేందుకు ప్రయత్నించినప్పటికీ, వాటికి సరైన మద్దతు లేకపోవడంతో, ఉత్పత్తి సామర్థ్యం పెరగలేకపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. చైనాలో తయారయ్యే వస్తువులపై ఆధారపడకుండా, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మోదీ ప్రభుత్వం దేశీయ తయారీ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ఇది భారత యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఉత్పత్తుల పెంపుపై కేంద్రం సమగ్ర కార్యాచరణ రూపొందించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నిజంగా సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version