Site icon HashtagU Telugu

Jalebi Factor : ‘జిలేబీ పే చర్చా’.. హర్యానా పోల్స్‌లో పొలిటికల్ దుమారం

Rahul Gandhi Jalebi Factor Haryana Polls

Jalebi Factor : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జిలేబీ ఫ్యాక్టర్ బాగా పనిచేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని గొహన ప్రాంతంలో మాథురామ్ అండ్ ఫ్యామిలీ విక్రయించే జిలేబీల గురించి ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో పలువురు రాజకీయ నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీని గురించి ప్రసంగంలో చెప్పుకొచ్చారు. గొహనా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మాథు రామ్‌ హల్వాయి స్వీట్ల బాక్స్‌ను ప్రజలకు చూపించారు. ‘‘ఈ స్వీట్లను దేశవ్యాప్తంగా(Jalebi Factor) విక్రయించాలి. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి. దానివల్ల 20వేల నుంచి 50వేల మందికి ఉపాధి పెరుగుతుంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read :BYD eMAX 7 : సింగిల్‌ ఛార్జింగ్‌తో 530 కి.మీ మైలేజీ.. ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ వచ్చేసింది

ఈ వ్యాఖ్యలకు అప్పట్లో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్‌ కౌంటర్ ఇచ్చారు. ‘‘గొహనా జిలేబీ ఫ్యాక్టరీని అమెరికాలో పెట్టాలని రాహుల్ గాంధీ అంటున్నారు. అసలు ఆ జిలేబీ తయారీ పద్ధతి గురించి ఆయన అర్థం చేసుకోవాలి. రాహుల్ ప్రసంగాలు రాసేవాళ్లు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి’’ అని రవిశంకర్ ప్రసాద్‌ విమర్శించారు. ‘‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు వస్తారు. ప్రధాని పదవి అనేది ఏమైనా మాథురామ్‌ జిలేబీనా.. పంచుకోవడానికి ?’’ అని రాహుల్‌కు రవిశంకర్ ప్రసాద్‌ ప్రశ్నను సంధించారు.

Also Read :Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం

ఇవాళ ఉదయం హర్యానాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవగానే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోయింది. అయితే కాంగ్రెసే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో వెంటనే కాంగ్రెస్ శ్రేణులు జిలేబీలను పంచుకొని సంబురాలు చేసుకున్నాయి. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎన్నికల ఫలితాల ట్రెండ్ మారిపోయింది. బీజేపీ అభ్యర్థులకు ఆధిక్యం రావడం మొదలైంది. దీంతో హర్యానాలో పలుచోట్ల బీజేపీ నేతలు జిలేబీలకు ఆర్డర్లు ఇచ్చారు. తాము కూడా పోటీగా జిలేబీలను పంచి సంబురాలు చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం మీద ఇవాళ హర్యానాలో జిలేబీ ప్రధాన చర్చనీయ అంశంగా మారింది.