Site icon HashtagU Telugu

Rahul Disqualify : మోడీ,ఆదానీ సంగ‌తి తేల్చుతా : రాహుల్‌

Rahul Disqualify

Rahul Imresizer

ప్ర‌ధాని మోడీపై ఎంపీగా అన‌ర్హ‌త వేటుప‌డిన రాహుల్(Rahul Disqaulify) యుద్ధానికి దిగారు. జీవిత‌కాలం అన‌ర్హ‌త వేటు వేసినా, జైల్లో ఉంచినా భ‌య‌ప‌డ‌కుండా మోడీ, ఆదానీ సంబంధాల‌పై పోరాడుతూనే ఉంటాన‌ని బీజేపీని హెచ్చ‌రించారు.  రూ. 20వేల కోట్లు షెల్ కంపెనీల ద్వారా మార్పిడి జ‌రిగిన అంశాన్ని లేవ‌నెత్తారు. గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి మోడీ, ఆదానీ(Modi-Aadani) ఆర్థిక బంధం న‌డుస్తోందని తీవ్ర ఆరోప‌ణ‌ల‌కు దిగారు. జీవిత‌కాలం జైలుకు పంపించిన‌ప్ప‌టికీ మోడీ-ఆదానీ అక్ర‌మాల‌పై పోరాట‌డం ఆప‌నంటూ రాహుల్ శ‌ప‌థం చేశారు. అన‌ర్హ‌త వేటు వేస్తే భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తేలేద‌ని అన్నారు. దేశం ఇచ్చిన ప్రేమ‌, అప్యాయ‌త‌లను కూడ‌గ‌ట్టుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుతానంటూ మోడీపై ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌ధాని మోడీపై రాహుల్  యుద్ధానికి (Rahul Disqaulify) 

పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ, ఆదానీ (Modi-Aadani)వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని భ‌య‌ప‌డి అన‌ర్హ‌త వేటు(Rahul Disqualify) వేశార‌ని రాహుల్ అన్నారు. ‘నా తదుపరి ప్రసంగానికి ప్రధాని భయపడిపోవడంతో నాపై అనర్హత వేటు పడింది.ఆయన కళ్లలో భయం కనిపించింది. అందుకే నేను పార్లమెంట్‌లో మాట్లాడకూడదనుకుంటున్నారు` అంటూ రాహుల్ మీడియా ముందు వెల్ల‌డించారు. భారత దేశీయ వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని నేను కోరలేదని వివ‌రించారు.

జీవిత‌కాలం అన‌ర్హ‌త వేటు వేసినా, జైల్లో ఉంచినా భ‌య‌ప‌డ‌కుండా (Modi-Aadani)

కేరళలోని వాయనాడ్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు (Rahul Disqualify)పడిన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ మీడియా ముందుకొచ్చారు. తనకు భయం లేదని, జైలులో ఉండ‌డానికైనా సిద్ధ‌మేనంటూ స‌వాల్ విసిరారు.“నేను భయపడను, అనర్హత గురించి నేను పట్టించుకోను. నేను ప్రధాని మోదీ, అదానీ (Modi-Aadani)సంబంధాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు నా నినాదం సత్యం దాని కోసం నేను పోరాడుతూనే ఉంటాను` అంటూ రాహుల్ ధీమాను వ్యక్త‌ప‌రిచారు.

Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?

అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ ఉంది. “దేశం ప్రజాస్వామ్య స్వభావాన్ని రక్షించడమే నా పని, అంటే దేశంలోని సంస్థలను రక్షించడం, దేశంలోని పేద ప్రజల గొంతును రక్షించడం. మరియు ప్రధానమంత్రితో ఉన్న సంబంధాన్ని ఉపయోగించుకుంటున్న అదానీ వంటి వ్యక్తుల గురించి ప్రజలకు నిజం చెప్పండం` త‌న విధిగా భావిస్తున్నాన‌ని (Rahul Disqualify) రాహుల్ అన్నారు. “భారత ప్రజల ప్రజాస్వామ్య వాణిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను దానిని కొనసాగిస్తాను. నేను ఎవరికీ భయపడను.` అంటూ పదేప‌దే చెబుతూ ఆయ‌న పోరాట‌ప‌టిమ‌ను తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేశారు.

దేశం ప్రజాస్వామ్య స్వభావాన్ని రక్షించడమే నా పని

కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభిస్తాయని, దేశవ్యాప్త ఆందోళన కొన‌సాగుతుంద‌ని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్‌డి అప్పచ్చన్ మాట్లాడుతూ, నిరసనలో భాగంగా, వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈరోజు ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అన‌ర్హ‌త‌ను నిర‌సిస్తూ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది, ఇది “భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేష గా ఆ పార్టీ పేర్కొంది. “చట్టబద్ధంగా , రాజకీయంగా” యుద్ధం జరుగుతుందని నొక్కి చెప్పింది.

Also Read : Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

అయితే, కాంగ్రెస్ ఎంపీపై అనర్హత వేటు వేయడం చట్టబద్ధమైనదని బీజేపీ పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఈ నిర్ణయం చట్టబద్ధమైనదని, నిరసనతో న్యాయవ్యవస్థను కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ఆరోపించారు.

Also Read : Rahul Gandhi Disqualified: రాహుల్ పై అన‌ర్హ‌త వేటు