Site icon HashtagU Telugu

Purandeswari : బీజేపీకి మహిళా సారథి.. రేసులో పురంధేశ్వరి..?

Purandeswari Bjp Chef

Purandeswari Bjp Chef

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్ష పదవికి పలువురు మహిళ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిదేళ్ల పాటు అధినేతగా సేవలందించిన జేపీ నడ్డా పదవీకాలం ముగిసే దశకు చేరుకోవడంతో, ఈసారి మహిళకు ఈ పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. బీజేపీలో మహిళా నేతలకు గౌరవమైన స్థానం ఉండటం, సమాజంలో మహిళా హక్కులపై పార్టీ తీసుకుంటున్న దృష్టిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

SpiceJet : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

ఈ పోటీలో ముగ్గురు ప్రముఖ మహిళా నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌లు జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో నిర్మల సీతారామన్‌కు కేంద్రంలో మంత్రిగా అనుభవం ఉండటం, పురంధేశ్వరికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో పాటు దక్షిణ భారత నుంచి బలమైన నాయకురాలిగా ఎదగడం, వానతి శ్రీనివాసన్‌కు పార్టీ కార్యక్రమాల్లో గ్రాస్రూట్స్ స్థాయిలో చొరవ ఉండటం ప్రధాన బలాలు.

ఇటీవలే బీజేపీ అధిష్ఠానం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ పరిణామాలు చూస్తుంటే, పార్టీ కొత్త వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలనే ధోరణిలో ఉందని కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి (Purandeswari ) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దక్షిణ భారత రాజకీయాల్లో మహిళా నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు పార్టీ అంతర్గతంగా మద్దతు ఉన్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎవరి పేరు ఖరారవుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.