Site icon HashtagU Telugu

Mehul Choksi : మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్.. బెల్జియం నుంచి భారత్‌కు ?

Punjab National Bank Pnb Scam Mehul Choksi Belgium Cbi

Mehul Choksi : ఉగ్రవాది తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి తీసుకురావడంలో భారత్ సక్సెస్ అయింది. తదుపరిగా ఆర్థిక ఉగ్రవాది మెహుల్‌ ఛోక్సీని కూడా తీసుకొచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఛోక్సీని గత శనివారం అరెస్టు చేయగా, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం మెహుల్‌ ఛోక్సీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతడు బెయిల్ కోసం బెల్జియం కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈక్రమంలో ఛోక్సీ అప్పగింత కోరుతూ అక్కడి కోర్టును ఆశ్రయించాలని భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. బెల్జియం ప్రభుత్వం, అక్కడి విదేశాంగ శాఖతోనూ భారత విదేశాంగశాఖ, సీబీఐ, ఈడీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బెల్జియం ప్రభుత్వం, కోర్టుల నుంచి సానుకూల సంకేతాలు వస్తే.. మెహుల్‌ ఛోక్సీ అప్పగింత సాధ్యమయ్యే అవకాశం ఉంది.  ‘‘మెహుల్ ఛోక్సీ(Mehul Choksi)పై నమోదైన వ్యక్తిగత కేసుల గురించి మేం వ్యాఖ్యానించబోం. ఈ కేసులో ముఖ్యమైన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం.ఛోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభించడానికి భారత అధికారులు ఇప్పటికే బెల్జియం అధికారులను సంప్రదించారు’’ అంటూ ఈ ఏడాది మార్చి నెల చివరి వారంలో బెల్జియం ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అంటే బెల్జియం సర్కారు సానుకూలంగానే స్పందిస్తోంది.

Also Read :Kumar Mangalam Birla : కుమార్‌ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్‌

మెహుల్ ఛోక్సీ.. ఇలా తప్పించుకున్నాడు ? 

Also Read :Virat Kohli Heart Issue: విరాట్ కోహ్లీకి గుండె స‌మ‌స్య‌.. ఆందోళ‌న‌లో ఆర్సీబీ ఫ్యాన్స్, వీడియో వైర‌ల్‌!