Physical Harassment : మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక దుండగుడు డెలివరీ బాయ్ ముసుగులో యువతిపై అత్యంత హేయమైన విధంగా అత్యాచారానికి పాల్పడి పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి మొబైల్‌లో తన సెల్ఫీ తీసుకుని, ‘మళ్లీ వస్తా’ అంటూ మెసేజ్ పంపిన దుండగుడు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారాడు. పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటన బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో పుణెలోని కొంధ్వా ప్రాంతంలోని ఓ ప్రముఖ అపార్ట్‌మెంట్ సముదాయంలో చోటు చేసుకుంది. బాధితురాలు (22) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నిందితుడు కొరియర్ బాయ్‌గా కనిపించి ఇంట్లోకి చొరబడ్డాడు. బ్యాంక్ నుంచి లెటర్ వచ్చిందని చెప్పి ఆమెను నమ్మబలికాడు.
Anganwadi : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
పెన్ను కోసం ఆమె బెడ్‌రూమ్‌కి వెళ్లిన వెంటనే అతడు తలుపు లోపల నుంచి మూసేసి ఆమెపై ఒక రకం స్ప్రే ఉపయోగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తన మొబైల్ చూసి షాక్‌కు గురైంది—అందులో నిందితుడి సెల్ఫీతో పాటు “మళ్లీ వస్తా” అనే బెదిరింపు సందేశం ఉండటం ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డీసీపీ షిండే మాట్లాడుతూ, నిందితుడిని పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించగా, నిందితుడి కోసం పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 64, 77 కింద కేసు నమోదు చేశారు.
Thalliki Vandanam : తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్