Teen Driver : మహారాష్ట్రలోని పూణేలో ఉన్నకళ్యాణి నగర్‌లో ఓ టీనేజర్ లగ్జరీ పోర్షే కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి ఇద్దరి చావుకు కారణమైన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సదరు మైనర్ తండ్రిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
సదరు మైనర్ (17) పోర్షే కారుతో యాక్సిడెంట్ చేయడానికి ముందు స్థానిక పబ్‌లో పార్టీ జరుపుకున్నాడు. అక్కడే అతడు మద్యం తాగాడు. 3.15 గంటల ప్రాంతంలో పోర్షే కారును వేగంగా నడుపుతూ కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద బైకును ఢీకొట్టాడు. దీతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. పోర్షే కారు ఇరుకైన సందులో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ కారుకు నంబర్ ప్లేట్లు కూడా లేవు.
Also Read :Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’
ఈ కారు ఢీకొనడంతో అనీష్ అవడియా, అశ్విని కోస్టా అనే యువకులు చనిపోయారు. వెంటనే కారులో ఉన్న టీనేజర్‌ను బయటికి లాగి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులను పిలిచి అప్పగించారు. ఆ మైనర్‌కు ఘటన జరిగిన 15 గంటల్లోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో రంగంలోకి దిగిన పూణే పోలీసులు.. సదరు బాలుడి తండ్రిని కూడా జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్లు 75, 77 కింద అరెస్టు చేశారు. పిల్లలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వంటి కేసులను బాలుడి తండ్రిపై పెట్టారు. మైనర్‌కు మద్యం అందించినందుకు బార్ యజమానులపై కూడా చర్యలను పోలీసులు మొదలుపెట్టారు. ఈవివరాలను పూణే కమిషనర్ ఆఫ్ పోలీస్ అమితేష్ కుమార్ వెల్లడించారు.
Also Read :Ebrahim Raisi : ఇరాన్ సుప్రీంలీడర్ పదవికి పోటీ.. రైసీ మరణంలో కొత్త కోణం
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్సు కొత్త రూల్స్
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. దీని ప్రకారం ఇకపై లైెసెన్సు కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ ఆఫీసుకు బదులుగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల వద్ద టెస్టుకు హాజరై సర్టిఫికెట్ పొందితే సరిపోతుంది. ఈ మేరకు శిక్షణ కేంద్రాలకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు 90వేల ప్రభుత్వ వాహనాల వాడకంపై ఆంక్షలు కూడా విధించింది. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25వేల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వెహికల్ ఓనర్ యొక్క డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు.