Site icon HashtagU Telugu

Jharkhand: జార్ఖండ్ మంత్రికి సంబంధించి రూ.35.23 కోట్లు స్వాధీనం.. ఈడీ విచారణ

Jharkhand

Jharkhand

Jharkhand: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్ మరియు అతనితో సంబంధం ఉన్న వ్యక్తులపై జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడిలో మొత్తం రూ. 35 కోట్ల 23 లక్షలు వెలుగు చూశాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో పట్టుబడిన నోట్ల లెక్కింపు పూర్తయింది. రికవరీ చేసిన మొత్తం రూ.35 కోట్ల 23 లక్షలుగా చెప్తున్నారు ఈడీ అధికారులు. కాగా మంత్రి అలంగీర్ ఆలంను ఈడీ ప్రశ్నించనుంది. అతనికి సమన్లు ​ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

విచారణలో భాగంగా సంజీవ్ కుమార్ లాల్ సంచలన విషయాలను వెల్లడించాడు.ఈడీ సేకరించిన డబ్బుకు తాను కేర్‌టేకర్‌గా ఉన్నానని, దీని కోసం తనకు నెలకు రూ.15,000 వచ్చేదని ప్రాథమిక విచారణలో జహంగీర్ ఆలం అంగీకరించాడు.మంత్రి ఆలంగీర్ స్వయంగా తన పీఎస్ సంజీవ్ కుమార్ లాల్ వద్ద జహంగీర్‌ను నియమించుకున్నారు. దీనికి ముందు మంత్రి నివాసంలో కూడా కొద్దిరోజులు పనిచేశారు. రాంచీలోని గధిఖానాలోని సర్ సయ్యద్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సంజీవ్ లాల్ అతని కోసం ఒక ఫ్లాట్ తీసుకున్నాడు.

We’re now on WhatsAppClick to Join

ఈడీ స్పందిస్తూ.. సంజీవ్ లాల్ రెండు రోజులకొకసారి జహంగీర్ ఆలంకు డబ్బుల బ్యాగ్ ఇస్తుండేవాడు, దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్లాట్‌లోని అల్మారాలో ఉంచేవాడు. సంజీవ్ లాల్ నివాసంలో రూ.10 లక్షలు, ఆయన భార్య నిర్మాణ సంస్థ భాగస్వామి మున్నా సింగ్ నివాసం నుంచి రూ.2 కోట్ల 93 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. జహంగీర్ ఫ్లాట్ లో వెలుగు చూసిన డబ్బు తనదని సంజీవ్ కుమార్ లాల్ ప్రాథమిక విచారణలో చెప్పగా ఆతనిని ఈడీ అరెస్టు చేసింది. దీంతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈడీ లేఖ రాసింది.

Also Read; RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..