India VS Canada : వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదులతో కెనడా ప్రభుత్వం అంటకాగిన వైనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ఒక ఖలిస్తానీ ఉగ్రవాది. ఇతగాడు అమెరికాలోని న్యూయార్క్‌లో తలదాచుకుంటున్నాడు. గురుపత్వంత్ సింగ్ పన్నూతోనూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో టచ్‌లో ఉండేవాడనే విషయం ఇప్పుడు బయటపడింది. ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థను పన్నూ నడుపుతున్నాాడు. ఈసంస్థను మన దేశం బ్యాన్ చేసింది. గతంలో ఓసారి కెనడా ప్రధాని ట్రూడోకు గురుపత్వంత్ సింగ్ పన్నూ రాసిన లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ ఆ లేఖలో పన్నూ ప్రస్తావించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Citizenship Act : పౌరసత్వ చట్టంలోని ‘సెక్షన్ 6ఏ’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
కెనడా ప్రధానమంత్రి ట్రూడోకు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ రాసిన పాత లేఖలో కీలక వివరాలు ఉన్నాయి. నిజ్జర్ హత్య వ్యవహారంలో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ(India VS Canada) పాత్ర ఉందని లేఖలో పన్నూ ఆరోపించడం గమనార్హం. సంజయ్ కుమార్ వర్మను కెనడా నుంచి బహిష్కరించాలని ఆ లేఖలో పన్నూ కోరాడు. ఒకవేళ వెంటనే సంజయ్ కుమార్ వర్మను బహిష్కరించకపోతే కెనడాలోని భారత ఏజెంట్ల చేతుల్లో మరికొందరు చనిపోయే ముప్పు ఉంటుందన్నాడు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను శాంతికాముకుడిగా పన్నూ అభివర్ణించాడు. ప్రస్తుతం కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ లేఖలోని అంశాల ప్రకారమే ఉండటం గమనార్హం. కెనడా ప్రభుత్వం ఖలిస్తానీలకు చేరువగా.. భారత్‌కు దూరంగా వెళ్తోంది అనేందుకు ఇటీవలే జరిగిన పరిణామాలే నిదర్శనం.
Also Read :Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్
వాస్తవానికి ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు నేరచరిత్ర ఉంది. హత్యలు మొదలుకొని బాంబుపేలుళ్ల దాకా ఎన్నో కేసుల్లో అతడి పాత్ర ఉంది. అటువంటి వ్యక్తిని శాంతికాముకుడిగా గురుపత్వంత్ సింగ్ పన్నూఅభివర్ణించాడు. అది నిజమనే సంకేతాలు ఇచ్చేలా ఇప్పుడు కెనడా ప్రభుత్వం గుడ్డి నిర్ణయాలు తీసుకుంటోంది. అదే కోణంలో ప్రకటనలు చేస్తోంది. భారత్‌పై బురద చల్లాలనే ప్రయత్నం మాత్రమే కెనడాలో కనిపిస్తోంది.